పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నాత్మేశ్వరా లోకహర్షహేషితము త
                       ద్దైవతస్వరము చందంబుఁ దెలుపఁ
గనకరత్నాంకురకాంతిచ్ఛటుల మంద
                       రాగపోషిత[1]కీరపూగ మగుచు


తే. గీ.

బెళుకు లీనెడిజల్లులు బిత్తరింపు
మేనిచాయలు సొగసైన మెఱుఁగుపచ్చ
పల్లడము [2]తరకసము డాబా ఫిరంగు
నందమైయున్న జగతేజి నపుడు గాంచి.

199


క.

ఉన్నతఖురాగ్రధారా
నున్నతలోర్వీవిధూతనూతనగృహగో
ధి న్నౌగిలి యున్నఁ గనుఁగొని
యన్నలినహితాన్వయేశుఁ డార్ద్రహృదయుఁడై.

200


తే. గీ.

అపుడు హాహా యటంచు నత్యంతకరుణఁ
గోమలమహీజపల్లవాంకురములందుఁ
బొదిగి మోహిని దెచ్చిన యుదకధార
లపుడు చల్లించి పైఁగప్పి నార్ద్రపటము.

201


వ.

అప్పుడు సేదదేరి గృహగోధిక రాజేంద్రుం జూచి యిట్లనియె.

202


సీ.

నరనాథ! శాకలనగరంబునం దొక
                       విప్రునిభార్య నవీనరూప
యౌవనసంపన్ననైన న న్నొల్లక
                       కలహించుఁ బరుషవాక్యములు పలుకు
నెవ్వరిపట్టున హిత మాచరించువాఁ
                       డీరీతి నను నాడ నెంతకేని
తాళి తాళఁగలేక తతదోషశీలనై
                       పతుల వర్జించిన పౌరసతులఁ


తే. గీ.

దద్వశీకరణౌషధాంతరము లడుగఁ
దమకుఁ బ్రత్యయమైన చందమున నపుడ
పొమ్ము [3]ప్రవ్రజ్య యొకతె యాపురముచెంత
నున్నయది దాసునిగఁ జేయనోపు ననిన.

  1. కీరవార మగుచు
  2. తరకసీలు
  3. ప్రవ్రజ్య యెకటి