పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నీకు సుఖంబైన [1]నెలవున నుండెద
                       నదియ మందరము నాఁ కాత్మభర్త
యుండినచో భార్య యుండగాఁదగు శూన్య
                       మైన గేహంబైన హైమనగము


తే. గీ.

పెన్నిధానంబు పతి కడుపేదయైనఁ
దండ్రిగృహమున నున్న కాంతాలలామ
యంధతమసంబునందు నత్యంతనరక
మనుభవింపుచు సూకరియై జనించు.

194


వ.

ఇట్లు నే నెఱింగి మందరంబున నుండనోపుదునే? సుఖదుఃఖంబులకుఁ
గర్తవగు నీతోఁగూడ భవత్పురంబున కరుగుదెంచెద ననిన మనంబు
రంజిల్లి కౌఁగిటం జేర్చి యిట్లనియె.

195


క.

దేవేరుల కగ్రణివై
నీవు మహాభోగవిభవనిరతిశయశ్రీ
ప్రావీణ్యంబున నుండుదు
జీవితమునకంటె నతివిశేషము మెఱయన్.

196


క.

అని రుక్మాంగదభూపతి
తనయోపద్రవము మీఁదఁ దలఁచక పలుకన్
వనిత ముహుర్మంజీర
ధ్వని నగములు గరఁగ నడచె [2]ధవుఁడుం దానున్.

197


క.

కొన్ని మహానీలరుచులఁ
గొన్ని మహారజతరుచులఁ గొన్ని రజతకాం
చ్యున్నతముల హరితాభలఁ
గొన్ని చెలంగంగఁ గనిరి కుధరతటంబుల్.

198


సీ.

వజ్రధారాగ్రతీవ్రఖురాగ్రమున ధరా
                       గ్రంబుఁ ద్రిప్పుచు సమగ్రత వహించి
[3] వల్గాముహుర్ముహు ర్వల్గు దంశనజాత
                       ఫేనంబు [4]చుక్కలవిధము గొనఁగ

  1. నెలవున నుండెద యదియ
  2. ధవుండుం దానున్
  3. వల్గా ముహుముహుర్వల్గు
  4. చుక్కల విరద గొనఁగ