పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

అనఘ! సుక్షతయైన కన్యను సగోత్ర
యైన కన్య ద్వితీయ దానైన కన్య
బ్రాహ్మణీశూద్రసంగమోత్పన్నకన్య
స్త్రీత్వవిరహిత యగు [1]కన్యఁ జెందఁదగదు.

187


క.

కానఁ గులంబున గుణ మభి
మానంబును గలుగు సత్కుమారీమణి న
న్నోనృపతి! పెండ్లి యాడిన
భూనుతమై నిజయశంబు పూజ్యత నొందున్.

188


వ.

అనిన నట్లనె శాస్త్రోక్తప్రకారంబున నగ్గిరియందు నుద్వహించి నగు
మొగంబున నిట్లనియె.

189


శా.

నాకశ్రీవిభవోపభోగమహిమల్ నాకల్పమై తోఁచె ము
న్నాకల్పంబు లభించినన్ జెలువ యొయ్యారంబు తేజంబు ల
క్ష్మీకౌతూహలలీల యోగ్యతయు వాసిం గల్గె నీ వబ్బఁగా
నో కల్యాణి! సురేంద్రవైభవము నా కుత్కృష్టమే చూడఁగన్.

190


ఉ.

కాన భవన్మనంబున నొకానొకకాంక్షిత మెద్ది గల్గినన్
ఓ నలినాయతాక్షి! చతురోన్నతిఁ జేసెదఁ జిత్తగింపు మెం
దైనను మంద్రశైలమలయాచలమేరుమహీంద్రనందనో
ద్యానములన్ రమించెదవొ ధన్యత మత్పురిలో రమించెదో.

191


వ.

అనిన మోహిని యిట్లనియె.

192


చ.

సవతులు క్రూరచిత్త లతిసాహనలన్ [2]నృమహోదయప్రియా!
సవతులు చూడ నొల్ల విదిశాపుర మామరణాంతకం బగున్
సవతులపోరు నేఁ దెలిసి సౌఖ్యముఁ గాంతునె? దాని కెవ్వియున్
[3]సవతులు నీనగేంద్రముల సంతతమున్ విహరింప నెంతయున్.

193


సీ.

అనఘ పుత్రవతి సంధ్యావళి యాసాధ్విఁ
                       బాసి నీ వేరీతి బ్రతుకువాఁడ
వతిదుఃఖమున నార్తి నందితివేని నా
                       కధికతరార్తి యౌ నట్లుగాన

  1. కన్యఁ లెల్ల....స
  2. స్మృ
  3. సవతులు యీనగేంద్రమున సంతతమున్ విహరింతు మెంతయున్.