పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గద్గదోక్తుల సాత్వికశ్రీలు రాజిల్ల
                       మోహిని నాత్మకామోహిని నతి
[1]పూర్ణలక్ష్మిం గాంచి, పూర్ణగాంతరముల
                       ననుభవించితి నాయొయారు లిట్లు


తే. గీ.

నమితసౌందర్యరేఖాసమగ్రమహిమ
వలచి వలపింపనేర్తురే వనిత! నీవు
వలచి వలపింప నేర్చితి వన్నె మెఱసి
మరులుగొంటి నిరీక్షణమాత్రముననె.

178


చ.

అమృతము చిల్కఁ బల్కక యొయారపుఁజూపులఁ జూచినంతనే
భ్రమము వహించితిన్ వికచపద్మనిభాస్య! యనుగ్రహింపవే
యమితములైన వాంఛితములన్నియు నిత్తు శరీర మిత్తుఁ బ్రా
ణము లిపు డిత్తు రాజ్యము ధనంబును నిత్తు జగంబు మెచ్చఁగన్.

179


చ.

జలనిధిచేలయై రవిశశాకరలోచనయై లసత్కులా
చలమణిభూషయై ఘనవిశాలపయోధరయై స్ఫురన్నభ
స్థలతనువై సురాలయవిశంకటమౌళియునై యధోంతరో
జ్జ్వలకటియైన భూవనితఁ జామ! భవన్నిజదూతిఁ జేసెదన్.

180


వ.

ప్రాణంబు లిచ్చువానికి గజవాజిరత్నమణిభూషణాంబరాదు లిచ్చు
టెంత? నన్నుఁ గటాక్షింపవే యన విని మధురోక్తుల నూరార్చి
యురంబునం జేర్చి యేమియు నేటికి? నేఁ గోరిన వాంఛితం బొకటి
దయసేయవే; యనేకక్రతుకర్తయు బహుపుణ్యరాశియు భూరిద్రవిణ
దాన[2]శస్తంబు నగు దక్షిణహస్తంబు శిరంబున నుంచిన నాకుఁ
బ్రత్యయం బయ్యెడి. నీవు ధర్మశీలుండవు. సత్యకీర్తివి. అనృతంబులు
పలుకనేరవు. యమపురంబు నిర్జనంబు గావించితివని ప్రశంసించిన
రాజేంద్రుం డిట్లనియె.

181
  1. పూర్ణలక్ష్మిఁ గాంచి
  2. శస్తం బగు