పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజు మోహినిం జూచి సంభాషించుట

తే. గీ.

మోహినీమోహనాద్భుతముఖరముఖర
నస్ఫురద్గానమున మృగశకునినికర
మవశత వహింప వీనుల కమృతముగను
దన్మహానాదరుచి నిండఁ దాను గలఁగి.

173


క.

మోహించి యామహీపతి
[1]వాహము దిగనుఱికి గిరికి వడినుఱికి జగ
న్మోహిని మోహిని లీలా
వాహినిఁ దేజఃప్రవాహవాహినిఁ గాంచెన్.

174


వ.

కాంచి.

175


తే. గీ.

రతియొ మాయయొ యీనగరాజసుతయొ
కమలగేహయొ యీసృష్టికర్త మాన
సాభిలాషంబు స్త్రీ లీలయై నటించె
నో యనఁగఁ దోఁచె నప్పు డాతోయజాక్షి.

176


వ.

అంతఁ బ్రతప్తచామీకరప్రభ నాయింతి లింగాశ్రితత్రినేత్రునేరి
మోహింపంజేయం జూచి యా క్షణంబున మోహించి మహిం బడి
విసంజ్ఞతం జెందినఁ దన్మోహిని కటాక్షాంచలకించిదవలోకనం
బొనరించి కార్యసిద్ధి యయ్యెనని వల్లకీగీతంబు చాలించి యశోక
రక్తాంగుళీపల్లవంబులచేత మృగపక్షిగణంబుల నదల్చుచు స్వవాసనా
గంధలోలంబగు భృంగజాలంబు వారింపుచు మధురోక్తుల రాజా!
లెమ్ము; మూర్ఛిల్ల నేటికి? నీకు నవశ్యంబు వశ్యనైతి; ధరాభారంబుఁ
దృణంగా వహించునట్టి ఘనుండ వీమోహభారంబు వహించు టెంత?
నీకు నామీఁద వాంఛ గలిగినయట్లనె నాకును నీమీఁద వాంఛ జనించె.
నిజదారంబలె నేలి రమింపుమని విన్నవించిన.

177


సీ.

అతిమధురోక్తిరసామృతధారలు
                       చెవులు సోఁకిన రాజశేఖరుండు
[2]శతపత్ర(చారు)విశాలనేత్రంబులు
                       చిగిరించుకొని కొంత చింత నొంది

  1. వాహము దిగనురికి గిరికి వడినురికి
  2. నే శతపత్రవిశాలనేత్రంబులు