పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వంధ్యాజననంబునుంబోలె నిష్ఫలం బగు. నీకు జనార్దనుభక్తినిష్ఠ
సర్వంబును ఫలించె నన మ్రొక్కి రాజ్యభారంబునకుఁ దనయుండు దివిరి
యున్నవాఁడు. మందరనగావలోకనంబునకు నేఁగెదనని విన్నవించిన.

168


తే. గీ.

తండ్రిఖేదంబుఁ దీర్చి తద్వాక్యసరణిఁ
దిరుగువానికి గంగానదీజలావ
గాహఫలము [1]లభించుఁ దత్క్షణమునందె
చెప్పఁ జిత్రంబు వాని విశేషమహిమ.

169


క.

గురువాక్యోల్లంఘన[2]దు
శ్చరితుఁడు (దాఁ) ద్రిపథగాంబుసంస్నాననిరం
తరశీలుఁడైన సుకృతాం
తర మింత లభించ దంచుఁ దలఁతురు విబుధుల్.

170


వ.

కావున నీ వవాప్తసకలకాముండవు హరిభక్తిమహోద్దాముండ వని
చెప్పి యనచినఁ దురంగంబు నెక్కి సరస్సరిద్వనోపవనశైలంబులు
చూచుచు శ్వేతగిరి గంధమాదనంబు దాఁటి ముందట.

171


సీ.

భాస్కరశతవిఖాభాసురంబగు దాని
                       హరిభుజాసంఘట్టనాభితస్స్ర
వత్కాంచనరసప్రవాహతఁ దగుదాని
                       బహువృక్షబహుధాతుబహుమణీంద్ర
బహునిర్జరశ్రీల ప్రభల మించినదాని
                       బహుసత్త్వనాదసంపదఁ జెలంగు
దానిఁ దేజోమయోదారామరావతీ
                       పురవతంసములీలఁ బూని మెఱయు


తే. గీ.

దాని [3]మందరభూధరోత్తమముఁ గాంచి
యప్పు డారూఢకాముఁడై యామహీమ
హేశుఁ డెడ యింత [4]దిరిగెడునిచ్చఁ దిరిగి
నిలిచినంతటఁ దచ్ఛైలనికరసీమ.

172
  1. లభించు తత్క్షణమునందె
  2. దుశ్చరితుఁడు త్రిపథగాంబు
  3. మందార
  4. దిరుగు నిచ్చఁ