పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

భీకరంబుగఁ దముఁ దామె పెట్టికొనిన
బిరుదు లేటికిఁ జూడు నాపెంపు సొంపు
పట్టనేటికి జముదాళి బాకు కిరుసు
సురియ విలునమ్ములున నేఁడు చూడు రాజ!

144


తే. గీ.

పులి యెలుఁగు పంది దుప్పి కార్పోతు మన్ను
జింక యన నెంత నేఁడు నాచంక నిఱికి
వేనవేలుగఁ దెత్తు నావేఁట చూడు
సామి! బంటుతనంబును సాహసమును.

145


తే. గీ.

నూటి కొక్కండు నామూఁకపోటుబంటు
సామి! పులుఁగైన వెలుఁగైన నేమి విడువు
కత్తియుఁ గటారి నేఁటికి కదిసినపుడె
చంకఁగొట్టి యడంతు నిశ్శంకవృత్తి.

146


వ.

అనుచు [1]వీరాలాపంబు లాడుచుండ.

147


తే. గీ.

దంష్ట్రికాగ్రసమాలగ్నతతసువృత్త
నిరుపమితపంకపటలమై యరుగుదెంచు
నట్టిఘోరవరాహంబు నవనినాథుఁ
డప్పు డాదివరాహమౌ ననుచు విడిచె.

148


తే. గీ.

కృష్ణసారాగ్రగణ్యత కీర్తి కెక్కు
[2]దానిపై బోయ యెప్పుడు తగిలి యేయు
నపుడు మీఁదట నయ్యెడు ననుచు మాన్పె
భూవరుఁడు భక్తినిష్ఠాతిపూర్ణుఁ డగుచు.

149

రుక్మాంగదుడు వామదేవునిఁ జూచుట

వ.

మఱియు నొక్కరుండు శార్దూలమస్తకంబుపైఁ దీవ్రంబులైన క్షుర
ప్రదరంబులు రెండు నాటి యజంబుఁ జేసి విడిచె. ఒక్కఁడు కార్పోతు
విషాణంబులు విరిచి పందికొమ్ము సురియచే వదనంబు గ్రుమ్మి
యేకలంబులం జేసి పాఱిందగిలె. ఒక్కరుండు చమరీమృగంబులం
గరంబుల బాహుమూలంబులఁ బదంబుల నంసంబుల నిఱికించుకొని

  1. వీరాలాపంబు లాడుచు
  2. దానిపైఁ బోయప్పుడు తగిలి యేయ నపుడు