పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

వడదోళ్లు విల్లు నమ్ములు
జడకట్టిన వంకసిగలు జాగిలములు పె
ల్లడిదంబులు వేటరు ల
ప్పుడు పిడుగుం[1]దునియలట్ల మొగి నాల్చంగన్.

141


క.

హరికరికిరిగండకకా
సరగవయతరక్షుఋక్షశల్యకులంగో
త్కరభీకరఘోరవనాం
తరముల కపు డేఁగె ధరణిధవుఁ డుత్కంఠన్.

142


సీ.

పరిపక్వబహువిధఫలశిక్యములతోడ
                       [2]క్షౌద్రవీవధసహస్రములతోడఁ
బంచషసారంగబాలోత్కరముతోడఁ
                       బంజరకీరడింభములతోడఁ
బరిరటత్సంకుశాబకవితానముతోడఁ
                       గస్తూరికామృగోత్కరముతోడఁ
బల్యంకికాదండబహుదండములతోడ
                       భవ్యచామరకదంబములతోడ


తే. గీ.

నేల యీనినగతి వచ్చి నిలిచి కొలువు
మ్రొక్కు మ్రొక్కి యొయారంపుమొనలు దీర్చి
చెంచుదొర లందఱును విన్నవించి రొక్క
వింతగా నంత ధారుణీవిభునియెదుట.

143


సీ.

గావుపట్టెదఁ దొలంగక నిల్చెనేని బె
                       బ్బులుల నెన్నిటినైనఁ [3]బూని తెత్తు
నెలుఁగుఁ గూల్చెద నొక్క[4]యలుగున నిపుడు నా
                       యెలుఁగునఁ గడకడ కేఁగకున్నఁ
దగరుతాఁకుల బోడతలలుగాఁ దాఁకింతుఁ
                       గారుపోతులఁ గొమ్ముగములు విఱిచి
యొంటిగాఁ డెదురైన బంట పోకు మటంచు
                       ఢాకమై విదిలింతు నీకటారి

  1. దునియలట్ల పెల్లార్చంగన్
  2. క్షాద్ర
  3. బూని తెచ్చి
  4. యెలుఁగున