పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

షష్ఠపాతకి విక్రియాచరణపరుఁడు
హింసచేఁ జేయు తద్ధర్మ మేటిధర్మ
మది యధర్మంబె యండ్రు విద్యాఢ్యు లెల్ల
పాప మేటికి ధర్మసంపత్తి గాక.

133


వ.

అది గావున మృగహింసాసముద్భవంబైన స్వభావంబు విడువుము.
మున్ను రాజులు మృగయావిహారంబుచేత నష్టులైరని బోధించిన
భార్యం జూచి యిట్లనియె.

134


మ.

అబలా! నే మృగహింస సేయ మృగయావ్యాజంబునన్ నిర్భర
ప్రబలాభీలనిషాదభిల్లశబరప్రాయాటవీసీమ ది
క్ప్రబలశ్వాపదతస్కరాదిభయముల్ ప్రాపింపకుండన్ బ్రజన్
బ్రబలం జేసెద వెంట నిర్భరధనుష్పాణుల్ ననుం గొల్వఁగన్.

135


క.

తా నేని తనయుఁ డేనియు
భూనాథుఁడు పూనవలయు భూభారముఁ ద
న్మానవులఁ బ్రోచి మఱి స
న్మానించని ధర్మమైన నరక మొనర్చున్.

136


వ.

అని సమ్మతింపంజేసి.

137

రుక్మాంగదుఁడు వేఁటకు వెడలుట

మ.

పవనం బాకృతిఁ దాల్చె నాఁగనెఱి చౌపట్టాలు వ్రేడెంబు మేల్
రవకాల్ద్రొక్కులు మండలభ్రమణధారాపాతసవ్యాపన
వ్యవికృత్తక్రమసంక్రమ[1]క్రమము లొప్పం జారు వాల్తేజిపై
నవనీనాథవతంన మేఁగె మృగయాయత్తైకచిత్తంబునన్.

138


మ.

శతకోటిప్రభ మించి బాలతరుణీజాలస్తనోత్పీడనో
ద్యతమై చక్రఘటాంకుశధ్వజసురేఖాన్వితమై నవ్యభ
వ్యతరాశోకమహీజపల్లవనిభంబై యొప్పు [2]సవ్యేతరో
న్నతహస్తంబు మహీసుపర్వులకు నంతఃప్రీతిగాఁ జూపుచున్.

139


వ.

చను నా సమయంబున.

140
  1. క్రమము తోరం బౌర వాల్తేజిపై
  2. సవ్యేతరాశతహస్తంబు