పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

దక్షుఁడు నీరేరుహలస
దక్షుఁడు పుత్రుండు భార మానెడు నో ప
ద్మాక్షి! మృగయావిహారా
పేక్షం దిరిగెద మహామహీధరవనులన్.

129


వ.

అనిన సంధ్యావళి యిట్లనియె.

130


సీ.

సత్యంబు పలికితి జననాథ! పుత్రసౌ
                       ఖ్యము శతక్రతుఫలసమధికంబు
స్వామి! సప్తద్వీపసంవేష్టితావనిఁ
                       బ్రబలితి పుత్రునిఁ బ్రభునిఁ జేసి
భుజశక్తి మృగహింస పూనంగఁ దగదు జ
                       నార్దనప్రీతిగా యజ్ఞములు స
మృద్ధిఁ [1]గావించు ప్రసిద్ధికి నెక్కంగ
                       భోగస్పృహావృత్తిఁ బొరలక సుర


తే. గీ.

నరవరానందముగను మానసము నిలుపు
మట్ల నడచిన న్యాయ మన్యాయ మధిప!
మృగయ మృగయాతనాకర మగణితముగఁ
బుత్రవంతులు మృగయాశఁ బొంద రిట్లు.

131


క.

హరిఁ బూజింపు మహింసా
పరమో ధర్మ మనఁగ వినవె పార్థివదోషాం
తరములఁ బొరయని మృగములఁ
బొరిగొన నిజధర్మహాని భూపాలురకున్.

132


సీ.

విద్వజ్జనంబు షడ్విధ మని జీవహిం
                       సాఘంబు వర్ణింప నతిశయమున
మొదలిపాతకి యనుమోదించిన యతండు
                       ఘాతకుండు ద్వితీయపాతకి యగు
విశసనపరుఁడు భావింపఁ దృతీయపా
                       తకి యగు మాంసభక్షకుఁడు దాఁ జ
తుర్థపాతకి ఘటితోఁ బచన మొనర్చు
                       నతఁడు పంచమపాతకాన్వితుండు

  1. గావించు బ్రసిద్ధికి