పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శౌర్యంబున నన్నిదిక్కులు విమర్శింపుచు, ధాత్రి నిష్కంటకంబుగా
నేలుచు, నేకాదశి నుపవసించి ద్వాదశి సాధించి త్రివిధకర్మంబులయందు
మమత్వంబు విడిచి దేవేశుం జింతింపందగు. హవ్యకవ్యంబులు
దదాత్మ యగు జనార్దనునకే సమర్పితంబులు సేయవలయు. తురీయుం
డయ్యు హృషీకేశుండు నిసర్గంబున జగత్పతి యగు. స్వజాతివిర
హితంబైన సన్మార్గంబు నందున్న మాధవుండే యుపాస్యుండని,
పురుషోత్తముండే భోక్తయు భోక్తవ్యంబును [1]సర్వకర్మంబులందు
నతని కేది నియోగం (బది) సేయందగునని మేఘధ్వానంబగు పట
హంబు హస్తిమస్తకంబున మ్రోయింపుచుఁ జాటించు ధర్మాంగదు
మహిమ తనకంటె నధికంబని యెఱింగియు సంధ్యావళిం జూచి
హర్షించి రుక్మాంగదుం డిట్లనియె.

126


సీ.

పద్మాక్షి! చూచితే పద్మాక్షివోలె నా
                       నందకందంబైన నందనుండు
జనియించె [2]మనదు వంశంబు(ల్ పవిత్రంబు)
                       లయ్యె మోక్షంబను నట్టి వార్త
వింటిమి గాని కన్గొంటలే దెవ్వఁడు
                       నెందైన మదికి నభీష్టుఁడైన
వినయసంపన్నుండు ఘనతర దృఢశౌచ
                       శాలి ప్రతాపి మోక్షప్రకాశ


తే. గీ.

[3]రూపుఁడు భయాన్వవాయప్రదీపకుఁ డగు
తనయుఁ డుదయించి సకలసత్కర్మకరణ
దక్షుఁడై యున్న వీక్షించి తండ్రి యాత్మ
యందు నానందమందుట యమృతపదము.

127


క.

స్థావరజంగమరూపం
బౌ విశ్వత్రయమునందు నతిసౌఖ్యం బో
దేవి! సుపుత్రుఁడు జనకుని
భావ మెఱిఁగి యతఁడు పూను [4]భారముఁ బూనన్.

128
  1. సర్వకర్మంబులందు న్నతని కేది నియోగంబు సేయందగు
  2. మనల వంశము...
  3. రూపుఁడు భయకులప్రదీపకుఁ డగు
  4. భారముఁ బూనున్