పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

జనకున కతిఖేదముగాఁ
దనయుఁడు వర్తించెనేని తత్తనయుఁడు [1]
ల్పనియుతము ఘోర నిలయము
ల ననయమును గూలు దుఃఖరాశి యనంగన్.

116


ఆ. వె.

తండ్రిమాట యింత చాఁటక గృహమున
సకలభారములు స్వశక్తిఁ బూని
తెలివి నున్న సుతుఁడు దేవేశుసన్నిధి
నుండు దివిజులెల్ల నుల్లసిల్ల.

117


క.

వెలయఁగ నిద్రాహారం
బులు లేక యహర్నిశంబు భూప్రజలకునై
సలిపితి సత్క్రియ లుర్వీ
స్థలిని బ్రబుద్ధుండనైనదనుకఁ గుమారా!

118


సీ.

శైవమార్గంబున సంచరించినవారి
                       సౌరమంత్రోపాస్తి సలుపువారిఁ
బద్మాసనాచారపద్ధతి మనువారిఁ
                       బార్వతీమతవృత్తిఁ బఱఁగువారి
నరసి సాయంప్రాతరశనముల్ గొనువారి
                       నిత్యాగ్నిహోత్రులై నిలుచువారి
సతతతీర్ధాసక్తి జరుగుచుండెడువారి
                       శ్రాద్ధకర్మనియతిఁ బ్రబలువారి


తే. గీ.

బాలయువవృద్ధగుర్విణీబాలికాస
రోగవికలతరాసక్త[2]భోగశీలు
రైనవారిని హరివాసరాభిమాన
చణులఁ జేసితి శాస్త్రవిశ్వాసమహిమ.

119


వ.

కొందఱిని విత్తదండనంబు గావించి కొందఱిని విద్వన్ముఖంబున శాస్త్ర
దృష్టిని శాసించి నిగ్రహించిన నందఱు నిరాహారులైరి. ఇందునకై
ధరాతలంబున సుఖం బెఱుంగనైతి. ప్రజలు కొందఱు దుఃఖింపుదురు.
కొందఱు సమ్మతింపుదురు. అటు గావున స్వహస్త పరహస్తంబులఁ
బ్రజారక్షణంబు చేసిన నక్షయలోకంబులు గలవని పెద్ద లానతి యిచ్చిరి.
ఇంక మృగయావిహారాదిభోగంబు లనుభవించెద.

120
  1. కల్పనియుతఘోరనిలయముల
    ననయమునుం గూలు దుఃఖరాశి యనంగన్.
  2. బోగశీలులైనవారిని