పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

ఆరామామణి మూర్ఛనల్ బెళక గీతానీకముల్ వాడె గాం
ధారగ్రామము మేళవించి శృతులం దాళంబులం దంత్రులం
[1]గోరం జీఱిన నేఱుగా నమృతముల్ ఘూర్ణిల్ల శైలంబులున్
నీరై యుండఁగ వల్లకిన్ మృదుకరోన్నిద్రస్ఫురన్నైపుణిన్.

111


క.

తద్గీతామృతధారలు
హృద్గోళమునాటి కరఁగి యేతెంచె సము
దృద్గరిమమై దిగంబరుఁ
డుద్గతకందర్పసాయకోత్పాటితుఁడై.

112


మ.

తనిసెన్ మాసుషభోగసంపదలచేతం జాలఁ బెక్కేండ్లు కృ
ష్ణునిఁ బూజించె విరోధులం దునిమె నక్షుద్రప్రతాపంబునన్
మనుజానీకముఁ బట్టి యీక యమధామంబంతయున్ విద్య నే
ర్పునఁ బాడై పొగులంగఁజేసె నరుఁడే రుక్మాంగదుం డుర్వరన్.

113


సీ.

అతఁ డొకనాఁడు ధర్మాంగదుఁ బిలిచి యేఁ
                       బాలించినట్ల భూపాలనంబు
సేయుము పుత్రుఁ డూర్జితబలసంపద
                       చే సమర్థుండయి సిరి వహించు
రాజ్యభారంబు తోరంబుగా నిలువని
                       రాజుకీర్తియును ధర్మంబు నణఁగు
నటువంటి సుతుఁడు గుణాఢ్యుండు గలుగ సు
                       ఖంబు నొందని దురాగ్రహుఁడు పాపి


తే. గీ.

జనకభారభరణదక్షశౌర్యశాలి
యైన సూనుఁడు తద్భార మానఁడేని
చర్చ సేయ నజాగళస్తన[2]సమానుఁ
డతఁడు మనుజులలో నధమాధముండు.

114


ఆ. వె.

కన్నతండ్రికంటె ఘనుఁ డనఁగాఁ గీర్తి
గల్గి సూర్యదీప్తి ఘనత గాంచి
భూమి వెలయునట్టి పుత్రుండు పుత్రుండు
వాఁడె యుభయవంశవర్ధనుండు.

115
  1. గోరం జీరిన యేరుగా నమృతముల్ ఘూర్ణిల్ల శైలంబులుం
  2. సమాను నతఁడు