పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ప్రబలసురాసురప్రవరుల కెడలింప
                       నలవిగాని నగేంద్ర మరయ నెద్ది?
హరికి వ్యామగ్రాహ్యమై భుజాంగదసము
                       త్కాషసారంబైన గ్రావ మెద్ది?
పుక్కిటిబంటిగాఁ బూర్ణదుగ్ధాంభోధి
                       నోలలాడెడు మహాశైల మెద్ది?
భూతజాలావృతపురమర్దనైకవి
                       హారసౌధంబైన యచల మెద్ది?


తే. గీ.

దివిజులకు రచ్చ, తాపసప్రవరులకుఁ ద
పంబు పంట, సురాధిపభామలకు ర
తిప్రవర్తనవశ్యాధిదేవత, వివి
ధౌషధంబుల కాకరం, బట్టి శిఖరి.

106


చ.

అయుతము వేయుయోజనము లగ్గిరిమూలము దానియంతయే
నియతముగా వెడల్పును వినిర్మలకాంచనరత్నశృంగముల్
వియదవనీతలంబులను వింతలుగొల్పు మణిప్రభా[1]మహో
దయములు మించ ధామనిధిధామ మడంగఁగఁజేయఁ దద్గిరిన్.

107


తే. గీ.

అర్కతేజంబు దివ్యరత్నాలి గ్రోలి
యగ్గిరీంద్రంబు మెఱయ నయ్యవనిధరము
నంగలావణ్యధాళధళ్యమున వింత
మెఱుఁగు వెట్టుచు నొకశిలమీఁద నిలిచె.

108


తే. గీ.

సప్తయోజనవిశ్రుతశక్రనీల
కలితతచ్ఛిల దివ్యలింగంబు [2]మెఱయు
నది వియల్లింగ మన దళహస్తమితమ
హోచ్చతయు [3]నిన్మడి వెడల్పు నొనరి వెలయు.

109


వ.

ఆదివ్యలింగంబు సన్ముఖంబున.

110
  1. మహాదయమును మించ
  2. మెఱయ
  3. నినుమడి