పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

[1]నను వీక్షించి యచేతనంబులు మహోన్మాదంబునం [2]జొక్కుఁ జే
తన వస్తువ్రజముల్ గలంగవె సముద్యచ్ఛ్వాసనిశ్వాసతం
జని యిట్లంటినఁ జోద్యమే, యువతివీక్షావర్ణనాఖేలనన్
జనియించున్ వ్రతభంగి సంగిహృదయాసంగంబు లెవ్వారికిన్.

94


మహాస్రగ్ధర.

వితతభ్రూచాపముక్తావితథశశిముఖే
                       వీక్షణోగ్రాశుగంబుల్
ధృతి చిందన్ ధీరహృద్భిత్తికలు పలుమఱున్
                       దీటి నాటించఁగా, ను
ద్ధతిఁ దానెందాఁక వేడం దను కనవ్రతముల్
                       ధైర్యమున్ లజ్జయున్ ద
క్షతయున్ దేహేంద్రియస్వస్థతయు వినయమున్
                       సర్వమర్త్యాళి కుర్విన్.

95


మ.

సరిగాఁ బోల్తురు చంద్రబింబమని యోషావక్త్రబింబంబు నే
సరసుల్ [3]కావ్యలసత్కవిత్వవిభవైశ్వర్యంబునన్ మూఢులై
ధరపై దానికి నెవ్వి [4]భ్రూవిలసనోద్యద్విభ్రమాపాంగభం
గురవీక్షాదరహాసమోహనకళాకోపప్రసాదస్థితుల్.

96


శా.

ఔరా! జవ్వని మోహనాంగి భళిరా హా ముగ్ధముద్ధోక్తి భా
మారత్నం బని మాటిమాటికి మదోన్మత్తుండు చింతించి యా
నీరేజాననకేళికిన్ [5]మలయుఁ బూన్కిం గంతుఁ డేఁచంగ, వి
ద్యారూపంబగు మంత్రదేవత తదంతర్యామియుం బోలుచున్.

97


క.

తావకసురనరవర్గము
నేవెతలం బెట్టనేర దీక్షించి మదిన్
భావించి గౌరవించినఁ
బూవుంబోఁడులు కలంచి పోవరె వేగన్.

98
  1. చని వీక్షించి
  2. జొక్కు చేత వస్తుల్ వ్రజముల్ గలంగవే సముద్యచ్ఛ్వాసనిశ్శ్వాసతం
  3. కావ్యులు సత్కవిత్వ
  4. భూ
  5. మలయఁ