పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చూపులనేనియుఁ జూడరా దిట్లైన
                       నరకంబు, శ్వపచియౌ నాత్మ, నాత్మఁ
జింతింపరాదు తత్కాంతలఁ, గాంచి చి
                       త్తక్షోభ మందిన తన్మహాదు


తే. గీ.

రాత్ము నాజన్మకృతపుణ్య మప్పు డడఁగుఁ
దత్ప్రసంగం బొనర్చిన దశసహస్ర
జన్మసుకృతంబు లన్నియు సడలు నట్టి
సుకృతములు వోవ నాఖువై క్షోణి నుండు.

82


వ.

అది గావునఁ దద్రాగంబు వలదు; మఱియు.

83


తే. గీ.

తనయునకుఁ [1]బదిరెండేండ్లు దాఁటినపుడు
జననికేనియు నభ్యంగసమయమునను
బాదము లొసంగఁజనదు సంప్రాప్తపూర్ణ
[2]యౌవనోత్కటుఁ డైనచో నాడనేల?

84


తే. గీ.

షష్టివత్సరములు దాఁటి చనిన జనని
సుతున కభ్యంజనము సేయ శుభతరంబు
శాటి దొలఁగిన నభ్యంగసమయమునను
జననియంగంబు వీక్షింపఁజనదు సుతుఁడు.

85


ఆ. వె.

[3]తల్లి వృద్ధయైనఁ, దరుణుఁడైనను వృద్ధుఁ
డైన నాత్మజుఁడు నిజాంఘ్రు [4]లంట
నవనియందు నిడఁగ నభ్యంజనంబున
నొనరు గౌరవము తదుభయమునకు.

86


క.

కరచరణంబులు దక్కం
దరుణీమణి పుత్రకునకుఁ దక్కిన యంగాం
తరములు మూయక చూపిన
[5]వరటక్రిమిపూర్ణ యగుచుఁ బడు నరకములన్.

87
  1. బదియు రెండేండ్లు
  2. యౌవనోత్కటుఁ డైనచో నెంచ నేల
  3. తల్లి వృద్ధయైన తరుణుఁడైనను
  4. లిడఁగ
  5. బరితక్రిమిపూర్ణ