పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. వె.

రాజహితులఁ గాంచి రాజులకంటెనుఁ
దేజ మెసఁగ భక్తిఁ దిరుగఁడేని
[1]గర్వియైన తదధికారిని వారలు
నిగ్రహింతు రొక్కనెపము చూచి.

74


ఆ. వె.

రాజహితులు సాపరాధులైనను వారి
దండనంబు సేయఁదగునె పనుల
వారికెల్ల భూమివల్లభుసత్కృప
[2]వార నిరపరాధు లైరి గాన.

75


తే. గీ.

దండ్యు లయ్యును విష్ణుతత్పరులు పరులు
దండ్యు లెన్నఁడుఁ గారయో దండధర! య
జాండగర్భంబునందు నుద్దండమహిమ
వారిబంధులఁ జూడవలయు నెఱిఁగి.

76


క.

[3]మద్భక్తుఁడైన నాభా
స్వద్భక్తుండైన నీకు సాహాయ్యక మే
[4]సద్భక్తిఁ జేసెదను ముర
జిద్భక్తులు సేయ మాన్పఁ జెల్లదు మాకున్.

77


వ.

సర్వదేవతలకు భగవంతుం డాఢ్యుండు. భగవద్భక్తుల నిగ్రహింపఁ
దగదు. ఉభయపక్షంబులయందు ద్వాదశివాసరం బొక్కొక్కవ్యాజంబు
చేతనే సాధించినవారు నీ కవమానంబు చేసిన నేను నిర్వహింప శక్తుండఁ
గాను. శక్తుండనై వచ్చితినేని స్వరూపహాని యగుఁ గావునఁ దద్భక్త
విరోధంబు సేయ వెఱతు ననినఁ గృతాంతుండు విజ్ఞాతకృతాంతుండై
యిట్లనియె.

78


సీ.

నీపాదములు గంటి నీరజోద్భవ నాకు
                       నిటువంటి యధికార మింకఁ జాలు
హరివాసరవ్రత మాచరింపక యుండ
                       నరసి యారుక్మాంగదావనీశు

  1. గర్వియగు తదధికారిని
  2. వారు
  3. మద్భక్తుఁడైన యాభా | స్వద్భక్తుండైన
  4. సద్భక్తిం జేసెదను