పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

ఇదియే చోద్యము గాఁగ భిన్నమతివై యి ట్లాడుచున్నాఁడ వా
పదచో సద్గుణ మొక్కచోఁ గలుగఁ దాపం బందినం బాతకం
బది యంచున్ మరణాంతికంబు స్మృతిమాత్రానీతచక్రాంకన
త్పద మానువ్రత మావ్రతంబున కసాధ్యం బెద్దియుం గల్గునే?

69


తే. గీ.

అవనియందు శతాశ్వమేధావబృథస
మంబు గృష్ణసకృత్ప్రణామంబు జనన
మందుఁ దిరుగ దశాశ్వమేధావబృథము
సేయువాఁ డిందు జననంబుఁ జెందఁ డరయ.

70


క.

[1]కురుకాశీగంగాదిక
వరతీర్థాంతరములందు వలనౌనె గతుల్
హరియను నక్షరములు రెం
డురుగతి నేనరునిజిహ్వ నూనిన యట్లన్.

71


ఆ. వె.

శ్వపచి యగునది మఱి రజస్వలయు నైనఁ
బూనిక వశి సురామాంసభోజియైనఁ
దద్ద్విజుం డంతమున హరిఁ దలఁచి పూర్వ
పాపములఁ బాసి [2]తద్దివ్యపదముఁ గనరె!

72


సీ.

ఉచ్చరించినమాత్ర నొనగూర్చుఁ గైవల్య
                       ముపవసించిన నీకయున్నె ముక్తి
హరివాసరమున జనార్దనుఁ బొగడి వం
                       దనము గావించి తత్కథలు విని వ్ర
తం బాచరింప వత్సరములు పదివేలు
                       గంగాతరంగిణికాండపూర
మున నవగాహించు పుణ్యంబు ప్రాపించు
                       మాకు లోకములకు మధువిరోధి


తే. గీ.

జనకుఁ డేకాదశీవ్రతశాలిఁ జూచి
యీర్ష్య సేయుట దుర్బుద్ధి యంతభాగ్య
శీలుఁడవు నిన్ను బంధించి చేతిగదలఁ
జూర్ణముగఁ జేయరైరి యో సూర్యతనయ!

73
  1. కురికాశీ
  2. తద్దివ్యపదముఁ జెందు