పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

సరణిఁ గానరు యోగంబు సాంఖ్యయోగ
మనఁగ [1]విన రెన్నఁడేని స్వాధ్యాయమైన
హవనకృత్యంబుఁ [2]జేయరు దివిరి వారు
హరిపదముఁ గాంచి రిట్ల నత్యద్భుతంబు.

59


వ.

మనుజు లేకాదశీవ్రతంబునఁ బితృపితామహులతోఁ బరమపదం బందు
టెంత? వారిపితృగణంబులఁ బితృగణంబును బరమపదంబు
నొందిరి. మాతామహు లట్లనె పరమపదంబు నొందిరి. బీజవిశేషంబున
భార్యాపక్షంబువారు నట్లన పరమపదంబు నొందిరి. మల్లిపితుడిచి
యెవ్వరు చేసిన పుణ్యపాపంబులు వారలే యనుభవించువారలు గాక
యితరుల కేమి కారణంబు? జామాతృపుణ్యమాహాత్మ్యంబున భార్యా
పక్షంబున కి ట్లర్హంబే? ఈనియోగంబు నే నొల్ల. యజ్ఞతీర్థదానయోగ
సంయోగంబుల నిటువంటి సద్గతి లేదు. ధాత్రీఫలానులిప్తులై వాంఛ
లుడిగి, రసభోజనోద్భవవాంఛలు విడిచి విభ్రష్టకర్ములేని హరి
లోకంబుఁ గాంచిరి. గళరజ్జుబంధనంబుల మద్దూతలు దెచ్చినవారల
హరిదూతలు శిక్షించి కొనిచనిరి. ద్వాదశాదిత్యతీవ్రతాపదుర్గమం
బైన మన్మార్గంబు భగ్నం బయ్యె నేమి విన్నవింతు నింక.

60


సీ.

హరిపదంబున కేఁగు నధ్వంబు త్రిభువనా
                       ర్చితమైనయది విమర్శింప నిసుక
చల్లిన రాలదు జనులచే నీలోక
                       మప్రమాణం బగమ్యం బనంత
మద్భుతం బింతింత యౌననఁగారాదు
                       గణుతించి చూచిన ఖల్వశంఖ
పద్మకోట్యాగముల్ బలసి కాపుర మున్న
                       నిండదు తజ్జనమండలంబు


తే. గీ.

మఱి సుకర్మస్థులును వికర్మస్థులును బ
విత్రు లపవిత్రులును రమావిభుదినంబు
నందు నుపవాస మొనరించి యందుచుంద్రు
పరమధామంబు తన్మహీపాలునాజ్ఞ.

61
  1. వినం డెన్నండేని
  2. జేయరు దేవ వారు