పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మధిపుకార్యము తప్ప నాచరింపుచుఁ బ్రజా
                       ద్రవ్యంబు భుజియించు తద్దురాత్ముఁ
డబ్దశతత్రయం బనుభవించు ననేక
                       నరకంబు లేలిన ధరణినాథు


తే. గీ.

కార్యమంతయు మఱచి వికారమొంది
మత్తుఁ డై యున్నయట్టి దుర్మానుఁ డందు
నఖిల[1]నిరయంబులును బ్రళయాంతమైన
ననుభవించు స్వకీయకర్మానువృత్తి.

55


తే. గీ.

స్వామికార్యంబు విడిచి దుర్జాలుఁ డాత్మ
కార్యమున నున్నచో మూషికత్వ మొందు
ధరణిలోపలఁ గల్పశతత్రయంబు
కమలసంభవ! మీయాజ్ఞ గాదె యిట్లు.

56


క.

భూనాథుకార్యమంతయుఁ
దా నింటనెయుండి భృత్యతతి చేర్చిన య
ట్లొ నను నియోగి [2]పాపం
బాని మహోత్కటబిడాలమై జనియించున్.

57


వ.

కావున మీయాజ్ఞ యుల్లంఘనము సేయక యింతకాలంబును బుణ్య
కర్మంబులఁ బుణ్యంబులును, బాపకర్మంబులఁ బాపంబులును ధర్మ
వేదులగు మునులతో విమర్శించి తత్తత్ఫలం బనుభవింపఁ[3]జేయు
నాకు నింక శక్యంబు గాదు వినుము.

58


సీ.

ధరణిపై రుక్మాంగదక్షమాధీశుఁ డే
                       కాదశీవ్రతదీక్షఁ గైకొనంగఁ
జతురబ్ధిపర్యంతజగతిలోఁ గల జను
                       లావ్రతమంతయు నాచరింపఁ
బాడయ్యె నేఁడు నాపట్టణంబంతయు
                       నితరధర్మములు లే వెవ్వి దేవ
పూజయు నిజపితృపూజయు భూసురు
                       పూజయుఁ జేయరు పుణ్యతీర్థ

  1. నిలయంబులును
  2. పాపం బూని
  3. జేయ