పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. వె.

చిత్రగుప్తుఁ డేల చిత్రధర్మాధర్మ
పత్రికలు లిఖించి పట్టుకొనఁడు
వినఁ గనంగరాని వింతలు పుట్టెనో
నాకమునకు హృతజనాకమునకు.

49


వ.

అని యచ్చటిజనంబు లాడుకొనుచున్నసమయంబున విరించి
పాదాగ్రంబుల నికృత్తమూలంబగు సాలంబునుంబోలె వ్రాలి త్రాహి
త్రాహి యని కన్నీరు తొరుఁగ సమ్మార్జితపటుండనైతి నని విన్నవించి
నిశ్చేష్టితుండైయున్న సభయందు నొకహలాహలశబ్దంబు పుట్టె;
మఱియు.

50


ఉ.

స్థావరజంగమాత్మకసుశస్తజగద్వలయంబు నీతఁడే
కేవల బాధ [1]నొంచ నపకీర్తికి రోయక యెంచె నట్టివాఁ
డీవెత నుండె సత్యమగు నెన్నిక కాకి టగాధబాధచేఁ
గావె యనేకబాధ లనఁగా జనతాఘన[2]పాప మారుటల్.

51


మ.

అని లోకుల్ సభ నాడ నావరుణుఁ డొయ్యన్ వారి వారించి యా
తని దండానతు శ్యామపీతనిజదోర్దండంబులన్ లేవ నె
త్తి నవీనో త్తమపీఠిపై నునిచి యెంతేవేడ్కతోఁ గాంచి మ
న్నన గావించి ప్రశంస చేసి యతినూత్నప్రీతితో నిట్లనున్.

52


తే. గీ.

ఎవ్వఁ డపకార మొనరించె నెవ్వఁ డిట్లు
బాధగాఁ జేసె మార్జితపటునిఁ జేసి
యెవ్వఁ డొనరించె సర్వంబు నెఱుఁగఁ బల్కు
వబ్జజుఁడు నీమనోదుఃఖ మవనయించు.

53


వ.

అని వరుణుండు పల్కిన శమనుండు కృతదుఃఖశమనుండై పితా
మహువదనంబుఁ జూచుచు నిట్లనియె.

54


సీ.

స్వామి! నాశక్తి తేజంబునంతయుఁ బోయె
                       నంతకంటెను మృతియైన మేలు
ప్రభుధనంబు భుజించి ప్రభునియోగోపేక్షఁ
                       గావించు నాతఁడు కాష్ఠకీట

  1. నొంద
  2. పాప మారునే