పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. వె.

అనుచు నిట్లు పలికి యంతకుం డంతకుఁ
జిత్రగుప్తు లట్ల చేష్ట లుడిగి
చిత్రగుప్తుఁ డాలసింపక వెంటరాఁ
ద్రోవ నరిగె నారదుండు దాను.

43


వ.

అంత.

44


శా.

మూర్తామూర్తజనంబు గొల్వ నిగమంబుల్ దానయై తజ్జగ
త్కర్తృత్వప్రపితామహత్వముల నోంకారాఖ్యమై హంసమై
యార్తత్రాయకమై స్వయంభువయి తుర్యంబై కుశాంకంబునై
కీర్తించందగు నొక్కతేజము [1]శుభోద్గీథంబు వీక్షింపుచున్.

45


సీ.

స(క)లదివ్యులు దిగీశ్వరలోకపాలకుల్
                       విగ్రహంబులు దాల్చి వేదములు పు
రాణంబు లఖిలశాస్త్రములు నాకృతిఁ బూని
                       జలధులు నదులు కాసారదీర్ఘి
కాకూపములు తటాకములు దేహము లెత్తి
                       యశ్వత్థముఖభూరుహములు మూర్తి
మంతంబులై సానుమంతంబు లాకార
                       ములతో నహోరాత్రములును బక్ష


తే. గీ.

ములును మాసంబులును వర్షములును [2]దనువుఁ
బొంది సత్కర్మములు బంధములును మేను
లమరి సత్వంబును రజంబుఁ దమముఁ జాల
నంగములు దాల్చి సేవించు నంతలోన.

46


వ.

శాంతరూపంబులు ఘోరవికారరూపంబులుం బరివేష్టింప నమ్మహా
విభుని నమ్ముఖంబున విన్ననై మొగంబు వంచికొనియున్న దండ
ధరునిం జూచి సభాసదు లిట్లనిరి.

47


ఉ.

దండధరుం డితం డధికదైన్యముతో నరుదెంచె నిమ్మహో
ద్దండుఁ డధర్మమన్నఁ దెగు ధర్మము గల్గిన నిర్వహించు బ్ర
హ్మా(ం)డములోని మానవుల కందరకు [3]సమవర్తి గాన ని
ట్లుండ క్షణంబు తీరదు మహోద్ధతి నిచ్చటి కేల వచ్చెనో?

48
  1. శుభోత్తేజంబు
  2. దనువులొంది
  3. సమవర్తి గాన యిట్లుండ