పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్న పేరుతో ఒకానొకగంధర్వు డుండేవాడు. అతడు సుందరాంగనలకు లోలుడై ప్రియుడై క్రీడిస్తూ ఉండేవాడు. విశ్వస్రష్టలైన బ్రహ్మలు "దేవసత్రం" అనే యాగం చేస్తూ శ్రీ మహావిష్ణువు కథలు గానం చేయడానికై గంధర్వులనూ, అప్సరసలనూ ఆహ్వానించారు. గంధర్వుడైన ఉపబర్హణుడు సైతం గంధర్వగణంతో కలిసి వెళ్ళి కొంతసేపు గానంచేసి అక్కడ ఉన్న అప్సరోవనితలను చూచి మోహితుడై గానాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. అందువల్ల "నీవు శూద్రయోనిలో పుట్టవలసిందని" ఉపబర్హణుని బ్రహ్మ శపించాడు. ఆ తరువాత ఉపబర్హణుడు ఒకదాసికి పుట్టి అనంతరజన్మలో శాపవిమోజనం జరిగి అంతకు పూర్వపుజన్మలో అంటే గంధర్వుడైన ఉపబర్హణుడుగా చిత్తశుద్ధితో శ్రీ మహావిష్ణుసంకీర్తనం చేసినందువల్ల నారదమహర్షిగా జన్మించాడు.

నారదుడు పూర్వజన్మంలో వేదవాదుల ఇంటిలో దాసికి పుట్టిన ఒకానొకవ్యక్తిగా చాతుర్మాస్యవ్రతంతో ఏకాంతవాసం చేస్తున్న మహర్షులకు పరిచర్య చేస్తూ ఉండేవాడు. చిన్నతనం నుంచీ మహర్షులనే ఆశ్రయించి ఉండడంవల్ల ఆ దాసీపుత్రునికిసైతం బ్రహ్మజ్ఞానం అలవడింది. అతని తల్లి పాలుపితుకుతున్న సమయంలో పాముకాటుతో మరణించింది. ఆ విధంగా సంసారబంధం తెగిపోవడంతో ఆ దాసీపుత్రుడైన బ్రహ్మజ్ఞాని మహదానందం పొంది ఉత్తరాభిముఖుడై ప్రయాణం చేసి ఒకానొకమహారణ్యంలో ప్రవేశించి అక్కడ మహేశ్వరుని గురించి తపస్సు చేస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమైనా అతడు చూడలేకపోయాడు. అనంతరం అతడు ఈశ్వరుని కొకరూపాన్ని కల్పించుకొని మనస్సులో నిల్పుకుందామని ప్రయత్నం చేశాడు. కాని అది అతనికి సాధ్యం కాలేదు. "మహర్షివర్యులు చూడగల్గిన నారూపాన్ని నీవు చూడలేవు. ఈ సృష్టి అంతా లయం చెందుతుంది. అప్పుడు నీవు యీదేహాన్ని పరిత్యజించి ముందుజన్మలో నా అనుమతితో నారూపాన్ని చూడగల్గుతావు." అన్న మహేశ్వరవాక్యం అతనికి వినపడింది. కొంతకాలానికి ప్రళయం రానే వచ్చింది. అప్పుడతను కర్మస్వరూపమైన ఆదేహాన్ని పరిత్యజించి హరికృపావనంలో శుద్ధసత్వమహత్వంతో నిండిన దేహంలో ప్రవేశించి శ్రీ మహావిష్ణుమూర్తిలో నిద్రపోవాలని ఇచ్చగించే బ్రహ్మ ఉఛ్వాసనిశ్వాసలవెంట బ్రహ్మలో ప్రవేశించి బ్రహ్మప్రాణంతో మరీచిప్రభృతి మునిముఖ్యులతోపాటు ఆ దాసీపుత్రుడైన బ్రహ్మజ్ఞానియే నారదుడై పుట్టినట్లు భాగవతం పేర్కొంటున్నది.

వరాహపురాణకథనంప్రకారం సారస్వతుడనే పేరు కలిగిన బ్రాహ్మణు డొక డుండేవాడు. ఆసారస్వతుడు సంసారభారమంతా తనకొడుకుమీద పెట్టి