పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏకాదశీమాహాత్మ్యము

తే. గీ.

జగతి రుక్మాంగదక్షితీశ్వరుఁడు ధర్మ
పరుఁడు గలఁ డొక్కరుఁడు విష్ణుభజనశక్తి
ఘనుఁడు తచ్చక్రహస్తునిగాని యన్య
దేవత భజియింపఁడు రాజతిలకుఁ డెలమి.

32


శా.

చాటించెన్ [1]మదహస్తిపైఁ బటహ ముచ్చైర్ఘోషమైయుండ ది
గ్వాటుల్ ఘూర్ణిల నానృపాలకుఁడు గర్జద్దుర్మతశ్రేణి ను
ద్ఘాటించెన్ హరివాసరంబునను భుక్తం బెవ్వఁ డాశించినన్
దాటింతున్ జటులాసిచే నతని మస్తంబంచు నత్యుద్ధతిన్.

33


సీ.

అష్టవర్షాధికుండైనవాఁ డెవ్వఁడేన్
                       బదియేండ్లదాఁక నాపద్మనాభు
దివసంబున మదీయదేశంబున భుజింపఁ
                       దగదు జననినైనఁ దండ్రినైన
దారపుత్రాప్తబాంధవులనైనను బట్టి
                       దండింతు [2]నిటఁ జోరదండనమున
నెఱిఁగింపుఁ డిపుడు మహీసురోత్తములకు
                       జాహ్నవీవారి మజ్జనము సేయుఁ


తే. గీ.

డబ్జనాభకథాలాప మాలకించుఁ
డనుచు నే నాడువచనంబు లాత్మఁబూని
నడచు మామకునకు నతినవ్యరాజ్య
భోగ మొనరింతు మత్కృపాపూర్ణమహిమ.

34


వ.

అని శుక్లపక్షంబులఁ గృష్ణపక్షంబులఁ బటహంబు మ్రోయించి.

35


క.

ఆరాజచంద్రుఁ డిటువలె
భూరివ్రతనిష్ఠ నడవఁ బురుషులు స్త్రీలున్
సౌరిపురిఁ జేర రెన్నఁడు
శౌరి పురియ కాని పుణ్యసామర్థ్యమునన్.

36


వ.

వ్యాజము చేసెనేనిఁ బరమపావనంబగు. ద్వాదశి సాధించెనేని హరి
మందిరంబుఁ జేరు. మఱియు.

37
  1. మదహస్తిపై పటహ
  2. నిట చోరదండనమున