పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

తర్కింపఁగ నకాలదత్త మపాత్ర[1]
                       త్తం బసత్కాలదత్తంబు క్రోధ
దత్తంబు పూర్వవిద్ధతిథిదత్తంబు ను
                       చ్ఛిష్టదత్తంబు[2]ను శ్రితజనైక
దత్తంబు పతితదత్తం బేకవస్త్రతా
                       దత్తంబు జలవరదత్త మగ్ర
కీర్తన దత్తంబు కేవలాసురజన
                       ప్రీతికరంబు ధాత్రీస్థలమున


తే. గీ.

నట్లు గావున విద్ధమౌ హరిదినమున
[3]నుపవసించినఁ బూర్వపుణ్యోత్కరంబు
లణఁగు వృషలీపతి యొనర్చినట్టి శ్రాద్ధ
కర్మమును బోలె సకలలోకములు నెఱుఁగ.

28


తే. గీ.

చక్రధరనామకీర్తి నస్తవనభజన
జప్తదత్తహృతస్నాతసవన[4]ముఖ్య
ములును బోవుఁ దిథినివేధమున మహోద్భ
టాంధతమసంబు సూర్యోదయమునఁ బోలె.

29


క.

ముదిసిన మగనిన్ యౌవన
మదవతులై యున్న సతులు మనసిజకేలిన్
గదియని యట్లనే వేదా
స్పదమగు తిథియందు ధర్మసంఘము దొలఁగున్.

30


వ.

అనిన విని ఋషులు శ్రీభగవదారాధనక్రియ విస్తరంబున నెఱింగింపు
మెందున హరి ప్రసన్నుండై సమీహితంబు లిచ్చుననిన సూతుండు
భక్తియే ప్రధానంబు. భక్తియుక్తుండై జడుండేని భగవంతుం బూజిం
చినఁ గ్లేశంబు లణంగు. తృష నొందినవాఁడు జలంబునఁ దృప్తుండైన
కరణిఁ బూజించినమాత్రనె హరి పరితోషంబు నొందు. నిందునకుఁ
బాపనాశనంబగు ఋషిగౌతమసంవాదంబునందు నైన రుక్మాంగదో
పాఖ్యానంబు విన్నవించెద వినుండు.

31
  1. దత్తంబు సత్కాలదత్తంబు
  2. ('ను' లేదు)
  3. నుపవసించిన పూర్వ
  4. ముఖ్యములు వోవు తిథినివేధమున