పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నవమి నభస్య కృష్ణత్రయోదశి మాఘ
                       [1]పంచదశమియును బావనములు
గ్రాహ్యంబు శుక్లపక్షమునఁ బౌర్వాహ్నిక
                       మాపరాహ్ణికము గ్రాహ్యంబు కృష్ణ


తే. గీ.

[2]పక్షమున నయనము దినభాగకంబు
సంక్రమణము షోడశాంశంబు నదియె
నిది యెఱింగి బుధోత్తము లెల్ల సకల
దానములు సేయవలయు ననూనమహిమ.

23


తే. గీ.

ఉత్తరాయణ ముడిగి సూర్యుండు వేగ
దక్షిణాయనమున కేఁగుతఱి మెలంగు
మధ్యకాలంబు విషమమై మహిఁ జెలంగు
నదియె ముక్తకనామధేయము వహించు.

24


మ.

తిథి సాంవత్సరికోపదేశమున బుద్ధిం జాల శోధించి సు
ప్రథితశ్రీ నుపవాస మున్న నగు ధర్మంబున్ శుభంబున్ మనో
రథముల్ సద్గతులున్, మహాదురితచర్యం బూర్వసంవిద్ధయౌ
[3]తిథియందే యుపవాసమున్నఁ గలదే తేజంబు పుణ్యస్థితుల్.

25


తే. గీ.

ఉత్తమోత్తమమైన గంగోదకంబు
నందు సురబిందుమాత్రంబు నందెనేని
యతిపవిత్రంబు గాని యట్లయ్యె దశమి
హరిదినమునఁ గళామాత్ర మంటెనేని.

26


తే. గీ.

ఉభయపక్షముల మహోత్తముండగు కుశ
కేతుఁ డఖిలదనుజజాతి యాత్మఁ
బొంగి సన్నుతింపఁ బూర్వవిద్ధములైన
తిథుల నుపవసింపఁ దెలిపె మున్ను.

27
  1. పంచదశమియు నివి పావనములు
  2. పక్షమున నయనముం దినభాగకంబు
  3. తిథియం దినుపవాసముం గలదె తేజంబు పుణ్యస్థితుల్