పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

నకును ద్వాదశియే మహోన్నతఫలప్ర
దయగు [1]వృద్ధిదినక్షయాంతరములందు
నపరిమితభక్తి ద్వాదశియందు నుపవ
సింపఁగాఁ దగు విద్ధ వర్జింపవలయు.

17


వ.

మఱియు ద్వాదశి పూర్వసంయుతమై యొప్పుచుండునప్పు డుపవా
సంబు నరులెల్లం జేయవలయు నన నుపవాసదినము పూర్వవిద్ధయై
ద్వితీయదినము నందు లేకయుండిన నేకాదశి [2]యె ట్లాచరింపవలయు
ననిన సూతుం డిట్లనియె.

18


తే. గీ.

ద్వాదశీ[3]దినమునఁ బూర్వవాసరంబు
నందు నేనియు సూర్యచక్రార్ధమాత్ర
మొందినను బరదినమున నుపవసింప
యుక్తమై యుండు సజ్జను లుల్లసిల్ల.

19


వ.

అనేకాగమవిరోధంబులు నైన నేమి? బ్రాహ్మణులు వివాదించిన నేమి?
ద్వాదశ్యుపవాసంబునుం ద్రయోదశిపారణయుం జేయవలయు.

20


తే. గీ.

అరయ నేకాదశి యవిద్ధ యైననేని
శ్రవణమునఁ గూడి పాపసంక్షయ మొనర్చు
నట్టి ద్వాదశి యుపవాస మందవలయు
ఘనతమై శుక్లకృష్ణపక్షములయందు.

21


వ.

ఏకాదశీ[4]ద్వాదశీనిర్ణయంబు తెలిపితి మఱియుం దెలియవలయునవి
యడుగుం డనిన ఋషులు యుగాదినిర్ణయం బడిగిన సూతుం
డిట్లనియె.

22

యుగాదినిర్ణయము

సీ.

అనఘాత్ములార! యుగాదులు శుక్లప
                       క్షమునందుఁ గృష్ణపక్షంబునందు
రెండు రెండనఁగ వర్తిల్లు వైశాఖశు
                       క్లతృతీయ[5]యుం గార్తికసితపక్ష

  1. వృద్ధిని దిన
  2. యట్ల నాచరింపవలయు
  3. దినమున పూర్వ
  4. శి
  5. యుఁ