పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

వెలయ నాదిత్యుఁ డుదయించువేళయందు
నింతయేనియుఁ దిథి గల్గెనేని యదియె
పూర్ణయగు [1]నుదయముఁ బాసి పూర్ణయైన
యదయ పూర్ణయ కాఁజూడుఁ డనఘులార!

13


వ.

పారణంబునకు మరణంబునకుం దత్కాలతిథి కర్తవ్యము. పైతృ
కంబునకు నస్తమయస్పృక్కైన తిథి కర్తవ్యము. పైతృకకర్మంబున
కుదయతిథి గ్రాహ్యంబు కాదు. కావున మౌహూర్తికులవలనఁ దిథి
శోధింపవలయు. తిథికిఁ బ్రమాణంబులు సూర్యచంద్రులు. పూర్వవిద్ధ
యైన నుపవసింపఁదగదు. స్నానపూజనంబులు యామచతుష్కంబు
వర్జించి దానకర్మంబులన్నియు శర్వరీ[2]ముఖంబునఁ జేయవలయు
నిది యుపవాసవిధిప్రకారంబు.

14


క.

ద్వాదశి యల్పమయిన నరు
ణోదయమున లేచి స్నానహోమార్చనదా
నాదికము సేయఁదగు నా
వేదజ్ఞుల కెల్ల ధర్మవృత్తి యెసంగన్.

15


క.

శుద్ధిఁ ద్రయోదశి సత్క
ర్మోద్దతిఁ బారణ యొనర్చి [3]యురుధాత్రీదా
నోద్ధత బల మున్నతయ
జ్ఞోద్దరణబలంబు మనుజుఁ డొందుచు నుండున్.

16


సీ.

[4]అదిగాన ద్వాదశి యల్పమయినను స్నా
                       నపితృతర్పణము లెన్నంగ నాడి
జరపి తద్ద్వాదశి సాధింపవలయు సా
                       ధింపకుండిన మహోదీర్ణవర్ణ
[5]హానియు నిజధర్మహానియు నగు సమ
                       గ్రముగ నస్నాతసరస్వతిగతి
భూరిదోషంబులు పుట్టిన నణఁగించి
                       వర్తించు శ్రీహరివాసరంబు

  1. నుదయమున బాశ
  2. ముఖంబున సేయవలయు
  3. యొనర్చి యట ధాత్రీదా | నోద్ధత బలము
    న్నత బలము య | జ్ఞోద్ధరణబలంబు
  4. అది గాన ద్వాదశి యల్పమైనను స్నానపితృతర్పణమ్ము లెన్నంగ నాడి
  5. హానిద నిజధర్మ హానిదయగు సమ