పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

హరివాసరోపవాసాం
తరమున జన్మాంతరములఁ దరలని పాపాం
తరము[1]లు జననీగర్భాం
తరవిణ్మూత్రాదిలిప్తతయుఁ దొలఁగు ధరన్.

10


వ.

ఈప్రశ్నంబె నైమిశారణ్యవాసులు వ్యాసశిష్యుండగు సూతునిం జూచి
మహాభారతంబు మొదలుకొని యష్టాదశపురాణంబులు నీ వెఱుంగనివి
లేవు. వేదశాస్త్రపురాణస్మృతులందు లేనిది యెద్దియును లేదు. కావున
సర్వంబును నీ వెఱుంగుదువు. మాహృదయంబుల నింత సంశ
యం బున్నది. తత్సంశయంబు దీర విస్తరంబున నెఱింగింపు. తిథి
ప్రాంతంబున నుపవసింపవలయునో? తిథిమూలంబున నుపవసింప
వలయునో? అందు దేవపితృకార్యంబులకు నుపయోగించినయవి
యెఱింగింపవే [2]యని యడిగిన నాసూతుండు శౌనకాదుల కిట్లనియె.
తిథ్యంతంబున దేవపితృహితంబుగా నుపవసింపవలయు. తిథి
మూలంబునఁ బైతృకం బాచరింప[3]వలయు.

11

తిథిఫలనిర్ణయము

ఆ. వె.

సాధు లాద్వితీయషష్ఠియష్టమి భూత
తిథి హరిదివసములఁ దెలిసి పూర్వ
విద్ధయైన దాని [4]విడువనగుఁ ద్రివర్గ
కాంక్షు లుపవసింపఁ గాదు ధరను.

12


సీ.

వాసిగాఁ బ్రాతి సాంవత్సరీకదశమి
                       పౌర్ణమాసీదరశిభవ్యతిథులు
పూర్వవిద్ధములైనఁ బూని సేయఁగఁ దగు
                       నట సేయకుండిన నతఁడు ఘోర
నరకంబులందు నానావిధహానియు
                       సంతతిచ్ఛేద మత్యంతదురిత
దౌర్భాగ్యములఁ జెందుఁ దప్పదు మున్నంచు
                       ద్వైపాయనుండు తథ్యముగఁ బలికె

  1. యని శౌనకాదు లడిగిన నాసూతుం డిట్లనియె.
  2. వలయునని
  3. విడువవలయుఁ ద్రివర్గ