పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


కవిరాజవిరాజితము.

దళితరసాదర సాదరపోషిత
                       ధర్మసుతాదిపృథాజ[1]మహా
ఖిలవదనాశనవాశనికల్పఫ
                       ణాకృతధీకృతచంక్రమణా
కలశపయోధిశయప్రభు సన్మణి
                       కాంతికిరీటసమించితపే
శలసురసామల సామలసన్ముఖ
                       సన్నుతసంతతధన్యగుణా!

189

గద్యము
ఇది శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర
కశ్యపగోత్రపవిత్ర శ్రీమదల్లాడు నరసింహ ప్రణీతంబైన
నారదీయపురాణమునందుఁ దృతీయాశ్వాసము
సంపూర్ణము
శ్రీశ్రీశ్రీ
శ్రీ

  1. మహాఖిలవదనాననవాళనికల్పఫణాకృతధీకృత యతి(?) చంక్రమణా!