పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

బలివిధ్వంసిపదాంబుజాతముల సద్భక్తిన్ నరుం డెవ్వఁ డా
తులసీవర్ణ మొకానొకప్పు డిడినన్ దుష్టాంతరంగక్రియల్
ఫలియించున్ భజియింప ముక్తిపదసోపానంబులం బోవుచో
వెలయున్ నందనకల్పభూజసుమనోవృష్టిచ్ఛటల్ మించుగన్.

182


క.

పటుభక్తి యాదవాచల
తటమున వరవేదఘోషతత[1]కావ్యాద్యు
త్కటనాదము విని యుద్భట
పటహధ్వనిఁ గడను బరమపదమున కేఁగున్.

183


గీ.

నిఖిలభవనైకరక్షాతినిర్నిమేషుఁ
డైన యదుగిరిభర్త యొకప్పుడేని
కనిన వారి నిజాననకమలగంధ
కలన వైకుంఠవిభుఁడు స్వాగతము పలుకు.

184


గీ.

దైవయోగంబుచేత నేధార్మికుండు
యాదవాద్రిని క్షణమేని యధివసించు
సకలకాలంబును వసించు శాశ్వతముగఁ
బరమపురుషైకగోష్ఠి నాభవ్యమూర్తి.

185


క.

ఇది విని యదుశైలం బా
స్పదమున ఘనవీతరాగవర్యులు చిత్సం
పద నిల్చిరి లక్ష్మీధవ
పదముల శేషాశనాదిపరిషద్గోష్ఠిన్.

186

ఆశ్వాసాంతము

శా.

చాణూరాహ్వయమల్లహల్లక మదస్తంబేరమాకంసని
ర్చాణూరస్త మతితృపాలనకరాగ్రాఘాత లక్ష్మీవధూ
మాణిక్యాభరణాభిరామ యతిరాణ్మందార భూజాతప్రా
మాణిక్యస్ఫురితాత్తబోధ చతరామ్నాయాంత మాయాంతకా!

187


క.

అక్రూరవరద యదుకుల
చక్రేశ్వర లక్షణావశంవద ధాత్రీ
చక్ర[2]వినిర్వహణోత్సుక
చిక్రింసా! ధుర్యవాగ్రుచిరమాధుర్యా!

188
  1. కాహద్యుత్కట
  2. వినిర్వహనోత్సుక