పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మాదానమునకంటె నధికంబు ధర్మ మా
                       ధర్మరహస్యకృత్యమునకంటెఁ
బ్రవ్రజనము మహాభవ్యంబు తత్ప్రవ
                       జనమునకంటే శస్తంబు వహ్ని


తే. గీ.

వహ్నికంటెను యజ్ఞంబు వరతరంబు
మానసము యజ్ఞమునకంటె మహితతరము
ఘనము న్యాసంబు మానసగరిమకంటెఁ
దద్విశేషంబు లెంచంగఁ దరము గావు.

121


వ.

నన్ను శరణు వొంది యేనరాధిపులు వర్తింతురు వారి నే శరణంబు నొంది
హృదయంబులో నుండుదు. మదర్పితపరు లెవ్వరు వారు నిర్భరులు.
వారి నిచ్చటనేని యచ్చటనేని నిర్వహింతు. సర్వదేవతలకు నే
నుత్తముండ నైనట్లు సర్వకాంతలలో నిందిర యుత్తమ యైనయట్లు
సర్వధర్మంబులకు న్యాసంబె ముఖ్యంబు. కర్మనిష్ఠవానికి జ్ఞాననిష్ఠ
దగ దాత్మజ్ఞాననిష్ఠ శరణాగతనిష్ఠ యే[1]యంశమునుఁ బోలదు.
ప్రధాన మగుటను మహత్తర మగుట నకించన్యసారంబునకంటె
విశ్వాసంబునకంటె శరణాగతనిష్ఠయందు నాచిత్తంబు ప్రవర్తింపుచున్న
యది. శరణంబని నన్నుఁ గొల్చిన నరుల మనోవీథి నిల్తు నిందునకు
సందేహంబు లేదు.

122


క.

నాయందు సకలభారము
లేయెడ నిల్పునెడ వారి నెఱిఁగి సతతముం
బాయక నే రక్షింతును
నాయతమతి నిత్తు నైహికాముష్మికముల్.

123


వ.

అని యిట్లు భగవంతుండు పల్క నంబరీషుండు శరణాగతమాహాత్మ్యం
బిట్లని వర్ణించె. నానలువురివృత్తాంబు లనేకంబులు గలవు. విస్తరింప
నేర సంసారసంతాపాదిప్రశాంతికి [2]నిట ననేకులు నివాసంబు
చేసికొనిరి. కాన మీరు నిందుండి పవిత్రులు [3]గండని రోమశుం డాన
తిచ్చిన వసిష్ఠపుత్రు లచ్చటనుండి పరిశుద్ధులై సితారణ్యసముద్భూత
తులసీదళసంచయంబున నారాయణు నారాధించి పరమపదం బందిరి.
ఇంకం జేయు కార్యంబు వినుం డెఱింగించెద. కలియుగంబున

  1. యంశమును నున్ను
  2. నిట్ల
  3. గమ్మని