పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

ప్రబలతరమైన కుహనావరాహరూప
మాత్మ నిడుకొని యర్చించి యతనివలనఁ
బూర్వవిజ్ఞాన మంది [1]యపూర్వశక్తి
శుద్ధసంకల్పు లగుచుఁ బ్రసిద్ధిఁ గనిరి.

118


వ.

ఇచ్చట నవ్వరాహమూర్తి భూకాంతకు శ్లోకద్వయం బుపదేశించె.
ఎప్పుడేనియు భక్తియోగంబున భజియించినవారికి నావరాహ[2]మూర్తి
విజ్ఞానంబు దెలుపు, నంబరీషుండు మున్ను జ్ఞానుల నుత్తమోత్తముండు.
భగవత్పాదంబులయందె యాత్యంతికనిష్ఠ నిలిపె. భగవత్పరు లెవ్వని
వాక్యంబేని యప్పుడ పఠింపుదురు. ము న్నంబరీషుండు భగవన్నిష్ఠ
నున్న విఘ్నంబు సేయ నింద్రుం డరుదెంచి వజ్రంబు వైచినఁ బురందరా!
ఏటికి వైచెదవు. గోవిందుని విడిచి యే నన్యుని భజింప. విష్ణుబలంబున
నున్నవాఁడనని భక్తిపరాధీనమానసుండై యారాజు స్వేచ్ఛావరాహరూప
సేవఁ గావించె. భగవంతుం డతనికి సర్వార్థంబులు ప్రసాదించి శరణాగత
ధర్మంబుఁ దత్వంబువలన నెఱింగించి యిట్లనియె.

119

న్యాసమాహాత్మ్యము

సీ.

ఒనర విద్యలకెల్ల నుత్తమోత్తమము లీ
                       వేదవేదాంతముల్ వివిధగతుల
విఖ్యాతమగు న్యాసవిద్య పూజ్యం బని
                       చాటి లోకములు ప్రశంస సేయ
శరణాగతియును న్యాసము సంవదనము న్యా
                       సంబు న్యాసంబు త్యాగంబు ననఁగ
సకలపురాణప్రశస్తంబు న్యాసంబు
                       పాంచరాత్రములందుఁ బ్రబలె న్యాస


తే. గీ.

మఖిలధర్మంబులను న్యాస మభిమతంబు
సర్వనియమంబులందు న్యాసంబు ఘనము
సర్వయత్నంబులందు న్యాసంబు శుభము
న్యాసమునకంటెఁ గలదె యన్యతర మొకటి.

120


సీ.

తపము శ్రేష్ఠంబు సత్యంబునకంటెను
                       తపమునకంటెను దమము యోగ్య
మాదమంబునకంటె నర్హంబు శమము శ
                       మంబునకంటె దానంబు ముఖ్య

  1. యాపూర్వశక్తి
  2. మూర్తికి