పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

నారదుం డిట్లనియె.

115


సీ.

ఘనులు వసిష్ఠనందనులు విశ్వామిత్ర
                       శాపసంగ్రస్తులై సంచరించి
బ్రహ్మరాక్షసవృత్తిఁ బరగఁ జతుర్వేది
                       [1]యెచ్చోట ముక్తుఁడై యేఁగె వారు
నచటికి నేఁగి యత్యంతదుస్తరశాప
                       మణఁగి దివ్యాకారులైన యది ప
లాశతీర్థము పుణ్యరాశి యాతీర్థంబు
                       మహిమ నుతింప బ్రహ్మకుఁ దరంబె


తే. గీ.

యమ్మహాపుణ్యతీర్థంబునందు మునిఁగి
యఘములు దొలంగి పరిశుద్దు లగుచు వైష్ణ
వాంఘ్రరేణువు లెగయు తీర్థాంతరముల
కరిగి రధికారులై విశిష్ఠాత్మభవులు.

116


వ.

విష్ణుభక్తాంఘ్రిపాంసువులచే వార లపాంసులైరి. విష్ణుభక్తాంఘ్రి
రేణువులచే నణువేని పర్వతంబగు. తదవమానంబునం బర్వతంబేని
యణువగుం గావునఁ గొన్నిదినంబులు దత్పలాశతీరంబున నుండి
తీర్థాంతరంబుల నిరువదియొక్కదినంబు నిలిచి పాపంబులం బాసి
కల్యాణతీరంబున కేఁగి తపోవిద్యాశీలవయోవిశేషంబులం బెద్దయగు
రోమశమహామునిం గాంచి పాదంబులం బడి నిజవృత్తాంతం బంతయు
విన్నవించిన.

117


సీ.

పరమభాగవతు లేవురుఁ గల రీమహా
                       క్షేత్రంబునందుఁ బ్రసిద్ధి కెక్కి
సాత్వికు లంబరీష వికుక్షి కుక్షి రు
                       క్మాంగద పుండరీకాఖ్యు లమ్మ
హాత్ములచేఁ బూజ్యమై యొప్పెఁ దమతమ
                       కాలంబునందు నీఘనులు వచ్చి
యజ్ఞానవారకంబగు తత్సలాశభూ
                       రుహము దక్షిణమున మహిమ వెలసి

  1. యచ్చోట ముక్తులై యేఁగె. యతిభంగము.