పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

తక్కినవారికి నగ్గిరి
యెక్కినవారికి నభీష్ట మిచ్చుం జుట్టుం
ద్రొక్కినవారికిఁ గన్గొని
మ్రొక్కినవారికిని లేదె మోక్షం బరయన్.

109


వ.

అప్పుడు విష్ణుచిత్తుభక్తిచే గరుడవాహనుం డుల్లసిల్లి
ప్రత్యక్షంబయిన.

110


సీ.

హారకిరీటకేయూరశోభితుఁ బద్మ
                       పత్రనిభేక్షణు భానుకోటి
భానిధిఁజంద్రబింబప్రతిభానను
                       ననుపమమందస్మితాభిరాము
తత నవేందీవరదళశోభనాకారు
                       నంబుజోదరదళాభాధరోష్ఠు
నుచితపీతాంబరు నుజ్జ్వలశ్రీవత్స
                       వక్షఃప్రదేశుఁ బావనచరిత్రు


తే. గీ.

హల్లకచ్ఛాయచరణుఁ జక్రాదినిరుప
మాయుధాంకితు శేషాశనాదివినుతు
గరుడవాహను లక్ష్మీప్రకాశమానుఁ
గాంచె నాబ్రహ్మచారి యుత్కంఠ మెఱసి.

111


వ.

కాంచి మ్రొక్కి నుతించి బ్రహ్మాదిలోకంబులు నిరసించిన యమ్మహాను
భావుండు సద్యోముక్తుం డయ్యెనని చెప్పిన, ఋషులు విని నారదున
కిట్లనిరి.

112


ఆ. వె.

విష్ణుచిత్తుమహిమ విని మహాత్మా! యేము
విష్ణుచిత్తుల[1]మయి వెలసితిమి స
మస్తమును లభించె ననఘ నీకరుణచే
యడుగవలసె నొకటి యట్లనైన.

113


మ.

అనఘా! మున్ను వసిష్ఠనందను లగమ్యంబైన శాపంబుఁ గ్ర
న్ననఁ బ్రాపించిన దీనులై రనుచు నానారాయణస్వామి వ
ల్కె నవార్యం బగునట్టిశాప మెటు లీక్షేత్రంబునం బాసెనో
ముని[2]కంఠీరవ! తెల్పవే యనిన నామోదంబు రెట్టింపఁగన్.

114
  1. మై. గణము?
  2. కంఠీవర?