పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నన దైవగతి నవశాత్ముండనై యిట్లు
                       సేసితి నన సురశేఖరుండు
నిజరూపము వహించి నిలిచి మదర్ధాస
                       నంబు నీ కిచ్చెద నాకలోక


తే. గీ.

సతులవైరూప్య మణఁగించు శాంతి నొంది
యనఁ బురందర స్వర్గసౌఖ్యంబు సకల
దుఃఖదము పుణ్య మడఁగ నధోగతిం బ
డంగఁ ద్రోయుట నరకఖండంబు గాదె?

93


వ.

అని బ్రహ్మచారి మఱియు నిట్లనియె.

94


తే. గీ.

విశ్వరూపునిఁ జంపి యీవిశ్వ మెఱుఁగ
బ్రహ్మహత్యామహాపాప[1]బహుళదుఃఖ
వార్ధి మునిఁగితి స్వారాజ్యవైభవంబు
గణన సేయంగ నీకు సౌఖ్యంబె యింద్ర!

95


సీ.

ఆది దూర్వాసప్రసాదమాల్యావమా
                       లాతిబాధల లజ్జ నందవైతి
వమరావతీపురం బన్యేంద్రముగ ననిం
                       ద్రము గాఁగ నెఱుఁగవే ధైర్యశక్తి
గలుగు కౌశికు ధాటిఁ గానవే బంధించి
                       యార్చిన మేఘనాథాంబకోగ్ర
ఘాత మెఱుంగవే గౌతముం డొనరించు
                       తదవస్థ లెఱుఁగవే దర్ప మంది


తే. గీ.

అన్నియును [2]మఱచితె జగం బెన్న నీదు
పట్టణం బొల్ల నింద్రత్వపదము నొల్ల
నిత్యదుఃఖకరంబులు నిర్జరేంద్ర!
యింటిత్రోవనె మఱలు నేఁ డిన్ని యేల?

96


వ.

అనిన సురస్త్రీశావమోచనాదికాలం బెన్నఁ డయ్యెడునని ప్రార్థించిన
దినత్రయంబు నన్ను నృత్యగీతాదులచే బాధ నొందించుటం జేసి
వర్షత్రయంబు వానరత్వంబు ననుభవింపఁగలరనిన నింద్రుండు

  1. బహుల
  2. మరచితివె — గణభంగము.