పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

ఏమి చెప్పంగ మదిలోన నించుకేని
చంచలత లేక యాబ్రహ్మచారి యుండెఁ
గేశవార్పితమతులఁ జొక్కింపఁగలవె
మర్మభేదకకందర్పమాయలెల్ల?

87


తే. గీ.

శాంతహృదయుండు తద్బ్రహ్మచారి తన్ను
నిట్లు వంచింపఁజూచు నయ్యిందుముఖుల
విఘ్నకాపేయమున బహువిధములైన
కర్మములు సేసితిరి మీరు కలుషవృత్తి.

88


క.

కాన కపు లగుచు ముందఱఁ
గానక పులకండమట్లు కమ్మనిమాటల్
మాని ఘనకిలకిలార్భటి
తో నిగుడుచుఁ గ్రోతు లగుచుఁ దూలుం డనుచున్.

89


క.

శాపం బిచ్చినఁ బుచ్ఛక
లాపంబులతోడఁ గిలకిలధ్వానముతో
సౌపర్వకామినులు ల
జ్జాపరలై యేగి రపుడు చనియె మరుండున్.

90


క.

అమరావతి నుండక యా
యమరాంగన లెల్ల నందనారామములో
భ్రమ మందగ నిజతనూవి
భ్రమ [1]మందఁగ నపు డపత్రపం గ్రుంగి రొగిన్.

91


క.

అంత వసంతుం డీవృ
త్తాంతం బంతయును దద్బలాంతకునకు న
త్యంతార్భటి నెఱిఁగించిన
సంతాపము నొంది యతఁడు చని యచ్చోటన్.

92


సీ.

బ్రాహ్మణాకృతి నిల్చి బ్రహ్మచారిం గని
                       యర్హమే నీకు మహాత్మ! రోష
మప్సరాంగనలు కీశాకారములు దాల్చి
                       నందున ఫల మేమి యయ్యె నీకు?

  1. మందత