పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

గ్రమ్మ పువ్వుల నెఱికొప్పుఁ గప్పుకొనుచు
మురిపె మందె వసంతవల్లరి వినోద
మంది సొలసెఁ దిలోత్తమ యతివిలాస
లాలనశ్రీలఁ దనయందు మేలు చూపె.

79


వ.

ఇట్లు పదుగురు మొనయై నిలుచునంత.

80


క.

వనితాసేనలతో నా
ననవిల్తుఁడు దండు వెడలె నాతియుఁ దానున్
దనమిత్రుఁడు మునిమానస
వనజంబులు [1]కలఁక వొంద వైభవనిధియై.

81


వ.

అంత.

82


తే. గీ.

సత్త్వనిష్ఠ మహాసాధుజనశరణ్య
నైమిశారణ్యమునకు మన్మథుఁడు పూర్ణ
గర్వమున నేఁగి చొచ్చె నక్కడ ననేక
సంభ్రమంబులు చేసె వసంతుఁ డపుడు.

83


క.

చిగిరించి పూచి కాచెన్
నగములు కోవెలలు మ్రోసె నానా[2]వనులన్
సొగసై ఝంకారంబులఁ
బొగరెక్కి చరించె మధుపపుంజం బంతన్.

84


ఆ. వె.

ఏకవీరుఁడై సమిద్ధశౌర్యమున మా
కందకుసుమశరము కంతుఁ డిక్షు
కార్ముకమునఁ దాల్చెఁ గాననాంతరముల
[3]గుఱులు వైచి యార్చుకొనుచుఁ దిరిగె.

85


చ.

వలపులు గ్రుమ్మరించు నిడువాలికచూపులఁ జూచి పయ్యెదల్
బెళకఁగ గుబ్బచన్ను లొకబిత్తరి లాగునఁ జూపి గానముల్
పలుకులు నృత్యవాద్యములు భవ్యవిలాసకళాకలాపముల్
దొలఁకఁగ బ్రహ్మచారికడఁ దూకొని నిల్చిరి చుట్టు నంగనల్.

86
  1. గలుగవో వైభవనిధియై
  2. వలఇన్
  3. గురులు వైచి