పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాటు విష్ణుచక్రప్రయోగపరమైన సుదర్శనప్రయోగం సైతం ఒకానొకవిశిష్టమైన, ఉన్నతస్థాయికి చెందిన చేతబడి ప్రయోగాల వంటివే. యివి దుష్టశిక్షణార్థం యేర్పడి శత్రువినాశనార్థం రూపొందించబడిన వివిధమంత్రప్రయోగాలే. అయితే మహావిష్ణువు కాని, మహేశ్వరాదిదేవతలు కాని, మహామాత గాయత్రివంటి స్త్రీదేవతలు కాని, యిటువంటి మహత్తరశక్తులను దుష్టశిక్షణార్థం శిష్టరక్షణార్థం కేవలం లోకశ్రేయస్సు దృష్ట్యా మాత్రమే వీటిని వినియోగించినట్లు కనిపిస్తున్నది. అవసరమైనపుడు దేవతలందరూ తమవద్ద గల శక్తులను ఉపయోగించినవారే. అసలిం తెందుకు? అటు దక్షిణాచార, యిటు వామాచారప్రయోగా లన్నింటికి మూలభూతమైన వేదవాఙ్మయం యెక్కడా శివుని తామసాత్మకునిగానూ, బ్రహ్మను రాజసాత్మకునిగాను, వర్ణించినట్లు కనబడదు. వాస్తవానికి హరిహరులకు భేదంలేదు. హరిహరనాథుణ్ని తిక్కన సోమయాజి —

కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా!
పరిష్క్రియాయాం బహుమన్యసేత్వమ్!
కిం కాలకూటః కిమువా యశోదా!
స్తన్యం తవ స్వాదువద ప్రభోమే!!

అని వర్ణించడం కొత్తవిషయం యేమీ కాదు. హరిహరుల అభేదత్వం తెలుగువారు తిక్కనసృష్టి అనుకొనడం శుద్ధపొరపాటు. ఋగ్వేదం పురుషసూక్తంలో ఒక్క హరిహరబ్రహ్మలకే కాదు, దేవతలందరికీ అభిన్నత్వాన్ని చాటడం జరిగింది. ప్రత్యేకించి ఆ మహాఫణిశాయి అయిన హరికి రాజఫణిభూషణభూషితుడై విరాజిల్లే హరునకూ అభేదత్వాన్ని గురించి పురాణవాక్కును ఉటంకించాలంటే నారదీయపురాణంలోనే యీ అభిన్నత్వం యెలుగెత్తి చాటబడిందని పేర్కొనవచ్చు. "కిం లక్షణా భాగవతా జాయంతే కేనకర్మణా" అని మార్కండేయుడు ప్రశ్నిస్తే, భగవంతుడు భాగవతోత్తమలక్షణాలు వక్కాణిస్తూ

"శివప్రియాః శివాసక్తాః శివపాదార్చనేరతాః
త్రిపుండ్రధారిణో యేచతేవై భాగవతోత్తమాః॥
వ్యవహరింతిచ నామాని హరేః శంభో ర్మహాత్మనః
రుద్రాక్షాలంకృతా యేచతేవై భాగవతోత్తమాః॥
యే యజంతి మహాదేవం క్రతుభిర్భహు దక్షిణైః
హరింవా పరయా భక్త్యాతేవ భాగవతోత్తమాః॥
శివేచ పరమేశేచ విష్ణౌచ పరమాత్మని
సంబుద్ధ్యా ప్రవర్తంతే తేవై భాగవతాః స్మృతాః॥
                  (నారదీయపురాణం : పూర్వ. భా. 5. అధ్యా.)