పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

నిద్ధశీల! పురాణంబులెల్ల మాధ
వార్చనంబే ప్రశస్తమౌ ననియె నాకు
విష్ణుసంతోషకారణవృద్ధి కెద్ది
సాధనము? తెల్పవే యని సన్నుతింప.

39

ధర్మకేతుఁడనురాజు చేయు నారాయణార్చనాప్రకారము

తే. గీ.

సకలసుమములచేతఁ గాంచనసుమముల
చేత గంధాదికంబులచేత నఖిల
భక్ష్యములు వ్యంజనములు పాకశుద్ధి
విమలముగఁ జేసి హరికి నైవేద్య మొసఁగి.

40


వ.

సేవించుమని పురోహితుం డుపదేశించిన.

41


మ.

కనకం బెంతయుఁ దెచ్చి పద్మసుమనఃకల్హారచాంపేయకాం
చనపున్నాగకదంబకుంద[1]వకుళాంచద్రూపముల్ చేసి త
ద్ఘనరత్నాంకితపుష్పమాలికలు వేడ్కన్ మీఱఁ గల్పించి యా
ననలం బూజ యొనర్చె మహీనాథుండు హర్షంబునన్.

42


వ.

అంత.

43


ఆ. వె.

భక్తిమై సహస్రభారప్రమిత[2]నయి
వేద్య మిచ్చి యాదివిష్ణుదేవు .
నభినుతించి యవనియందు దండానతి
చేసి నృత్తమాడి చెలఁగు నంత.

44


సీ.

తత్కాలమునను యాధాలాభనామకుఁ
                       డవనీసురుం డొకఁ డనఘనిష్ఠ
నూని యేకాదశి నుపవాస మొనరించి
                       నియతవ్రతంబున నయము గాంచి
నరులు మెచ్చఁగ యోజనత్రయాంతర్హి త
                       దేశంబునందు నుద్దీప్తి మెఱసి
యుండి ద్వాదశి నా సముజ్జ్వలతులసికా
                       మాలికఁ బూజించి మహిమ వెలయ

  1. వకుళాకారంబులం చేసి (యతిభంగము)
  2. ఈరూపము చింత్యము - మార్చినచో గణభంగము.