పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

అరసి శరణాగతులఁ బ్రోచునదియె ధర్మ
మగుట యేము నెఱుంగుదు మనఘ తిర్య
గాత్మలకు నిట్టిగుణ మెట్టు లమరె ననుచు
వేదములు పల్కె నపు డతివిస్మయముగ.

16

నాళీజంఘుని కథ

సీ.

వెలయఁ దిర్యగ్జంతువులను దిర్యగ్జంతు
                       వులకేని శరణాగతులను బ్రోవఁ
బరమధర్మము మున్ను భవ్యశీలంబైన
                       గంధర్వమిత్రమై ఘనత కెక్కు
రాజహంసంబు నాళీజంఘమను [1]పేరు
                       గలిగినయది సిరి గాంచి మెలఁగ
దారిద్ర్యమున ధరాతలమునఁ దిరుగుచు
                       నొకఁడు తత్సన్నిధినుండఁ గాంచి


తే. గీ.

ద్విజుని యట్లనె [2]తోఁచెదు, దీనవృత్తి
నేల వచ్చితి విచటికి? నేమి సేయ
వలయు నన బ్రాహ్మణుఁడు లేమివలన వచ్చి
నాఁడ నన హంస మప్పు డిట్లనుచుఁ బలికె.

17


శా.

గంధర్వేంద్రుఁ డొకండు మత్సఖుఁడు విఖ్యాతుండు దీనార్థి స
ద్బంధుం డాతఁ డొసంగు నీకు ధనసంపల్లబ్ధి యంచున్ స్వసం
బంధం బంతయుఁ దెల్పి రమ్మనుచు సంప్రార్థింప గేహంబులో
నంధోలేశము లేక స్రుక్కి చనె హంసావాస మావిప్రుఁడున్.

18


క.

ఆలో నిద్రాకులమగు
నాళీజంఘంబు కంఠనాళము విప్రుం
డాలోలతఁ బిసికిన వాఁ
డాలోకము చేరె భాస్కరాలోకమునన్.

19


సీ.

బ్రాహ్మణాధముఁడు తత్పలలంబు భక్షించి
                       నిద్రించునప్పు డానీడజంబు
పక్షముల్ గంధర్వపతి భటుల్ వీక్షించి
                       విప్రుని నెమ్మోము విన్నదనము

  1. పేరఁగలిగినయది
  2. తోఁచెడు