పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

కల్యాణతీర్థమహిమ య
తుల్యంబగుఁ దత్పవిత్రతోయాప్లవుఁడై
కల్యాణమందు మనుజుని
కల్యాణజలంబుఁ గ్రోలఁ గణఁగుదు రమరుల్.

241


క.

తులసీవరమణిమాలా
కళికలు పద్మాక్షుమాలికలు పూనిన ని
ర్మలుఁడు మహాపాపాచల
కులిశంబై మెఱయు జగము కొనియాడంగన్.

242


ఆ. వె.

ద్వాదశోర్ధ్వపుండ్రధారణార్హోత్తమ
స్థానముల గురించి జయుఁడు విజయుఁ
డవనిసురవరునకు నపు డుపదేశించి
[1]యాదరించినార లతని లెస్స.

243


క.

ఘనశక్తిఁ దప్తచక్రాం
కన మావిజయుం డొనర్చెఁ గౌతుకమున, వి
ష్ణునకుం జక్రాదిశుభాం
కనముననే ప్రీతి కాని కా దన్యమునన్.

244


తే. గీ.

బ్రాహ్మణక్షత్రియోరవ్యపాదభవులు
చక్రధారణసంపత్ప్రశస్తమహిమ
శ్రుతినిగళితంబు నియతైక మతిఁబ్రమాణ
మనుచు నది యాచరించుట యర్హతరము.

245


సీ.

ఆత్మభర్తకుఁ జిహ్నమగుట సత్కర్మాంగ
                       మైనది యని సకలాగమములుఁ
దెలియఁబల్కుట, ప్రకృతి గ్రంధి దాహకం
                       బగుట యాత్మకు హృద్యమై తనరుట
స్వప్రియరూపమై సంఘటిల్లుట దేహి
                       దేహసంస్కారమై తేటపడుట
పరభావహేతువై పాటించియుండుట
                       ప్రభవదన్యపరిహారమునఁ దగుట

  1. యాదరంబు దీర్చి యాదరమున