పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

ఇట్లనిరి.

216


క.

నీ వెవ్వఁడ వీవనమున
కీవచ్చినవార లెవ్వ రీరాక్షసజ
న్మావిర్భావము నీ కే
కైవడిఁ బ్రాపించె నెఱుఁగఁగాఁ బల్కు మనన్.

217


క.

తనసేఁతయుఁ, దనజన్మము
తనతనయులకథలు [1]దార తత్తత్కృతులున్
వినయమున విన్నవించెన్
మునుకొని యాబ్రాహ్మణోత్తముల కతఁడు వడిన్.

218


వ.

విన్నవించి.

219

సత్యనిష్ఠుఁడు వచించిన హరినామప్రభావము

ఉ.

ఏ నెటులన్ దరింపుదు మహీసురరత్నములార! యన్న వి
ద్యానిధి సత్యనిష్ఠుఁడను నాతఁడు పల్కెను బ్రహ్మరాక్షసుల్
శ్రీనళినాక్షకీర్తనవిశేషమునన్ ఘనపాతకంబు లా
యేనును దూలు; నిల్చు నిఁక నెయ్యెడ నయ్యుపపాతకావళుల్.

220


క.

నారాయణచారిత్రక
థారంభము మాని మర్త్యుఁ డన్యకథలకున్
బ్రారంభించుట గవ్యప
యోరుచి దిగనాడి కాంచికోత్సుకుఁ డగుటల్.

221


తే. గీ.

మందరాచలమంథానమథిత మగుచు
సుధ యమర్త్యులజిహ్వలు సోఁకె నాత్మ
జిహ్వ నుదయించి హరికథాంచితరసాయ
నంబు నరులకు సకలభాగ్యంబు నొసఁగు.

222


క.

భవదురుకాంతారాంతర
నివసనమలినాత్ములైన నీచాత్ముల క
ర్ణవశాయి కథామృతమును
[2]నవిరతముం గ్రోలఁ బూతతాత్మత గలుగున్.

223
  1. తన యుదారత్వంబున్
  2. నవిరతమున్ బూతవృత్తు లగుదురు వేగన్.