పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్వేది బ్రహ్మరాక్షసరూపంబు నొందుట

క.

అందున ఘనయాతన లిఁకఁ
బొందవు దుష్కర్మవృత్తి, [1]బూనెద వడవిం
జెంది జనరహితదేశము
నం దుండెదు బ్రహ్మరాక్షసాకారమునన్.

203


తే. గీ.

బ్రహ్మరాక్షసి యగు నీదుభార్య, నీదు
పుత్రకులు గృధ్రమూర్తులై పొదలవెంట
[2]భవదభిహతినిహతజంతుభక్షణేచ్ఛఁ
దిరుగుచుంద్రు వనాంతరదేశములను.

204


వ.

అని శమనుం డానతిచ్చిన బ్రహ్మరాక్షసవృత్తికిం గడ యెయ్యది యని
దీనుండై చతుర్వేది యడిగిన నెప్పుడు విష్ణుభక్తులం గాంచెద వప్పుడే
తద్దేహంబు వీడ్కొనియెద వని బంధనంబు విడిపించినఁ గుటుంబ
సమేతుండై పోయి యాభ్రష్టబ్రాహ్మణుండు వింధ్యారణ్యంబున నివ
సించుచుండె. మధురిపుపదసేవాపరిపక్వస్వాంతవృత్తియై యదుగిరి
తటంబున నున్న భాగవతు నెవ్వనినేని యవమానించినఁ జతుర్వేదివలెనే
నష్టుండగు ధరాతలంబున.

205


మ.

హరిరాతోత్తమపుణ్యసత్కథలు నిత్యానందసంపత్తి నె
వ్వరు విన్నన్ బఠియించినన్ హరి కృపావారాశియై వారిమం
దిరసీమన్ భుజియించుఁ, దద్విమతు లెంతే నష్టులై పొల్తు రు
ర్వర నెంచన్ ధనధాన్యసంపదయు నైశ్వర్యంబు మించన్ దగున్.

206


వ.

అనినఁ దద్బ్రహ్మరాక్షసత్వముక్తి వాని కె ట్లయ్యెనని మును లడిగిన
నారదుఁ డిట్లు తెలిపె.

207


సీ.

ఫలమూలవర్జితబహుకంటకాకీర్ణ
                       తతతప్తవాలుకాధ్వప్రదేశ
ఘనతరారణ్య భాగంబున నాఁకొని
                       తనువు దూలఁగ దూర ర్శనమున
నగ్నిశిఖారుణోద్యత్కీర్ణకేశమ
                       స్తకముతో వాయసతనువికార
కళలఁ గృశించి దగ్ధమతి నచలవర
                       మును బోలి తూలైకమూర్తిధారి

  1. బూనె దరణ్యానిం దొకయరహితదేశము
  2. భవదఖండాభిహాతజంతుభక్షేణేచ్ఛ