పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

తత్సంబంధోపజీవు లగువారి రాజభటులు కారాగృహంబున నిలిపిన నందె
వారు మృతులైరి. ఇవి యన్నియు దినత్రయంబున నయ్యె. హరిభక్తుల
నవమానంబు చేసినను, గురువుల బహూకరింపకయున్నను, దుష్టుల
బహూకరించినను, తను దా బహూకరించుకొనినను సంపదలు నశించు.
ఇది యైహికదుఃఖంబు, ఇఁక నాముష్మికదుఃఖంబులు వినుండు.

195

మృతుఁడైన చతుర్వేది నరకప్రాప్తుఁ డగుట

ఉ.

క్రూరులు కాలకింకరులు ఘోరతరాజినరజ్జుబంధని
స్తారితపాదుఁగా నిలిపి స్తంభముతోడ నధోముఖంబుగా
దారుణశక్తిఁ గట్టి బెడిదంబుగఁ బుత్రులతోడఁ గొట్టి రా
హారవవృత్తిఁ దద్ద్విజనిజాన్వయబాంధవులున్ జలింపఁగన్.

196


క.

సర్వాతిథి దానంతట
సర్వజనంబులు వినంగ సమవర్తివి నా
దుర్వర్తన తెలుపవె బుధ
నిర్వాహక మొఱ వినవె! నియతగుణాఢ్యా!


క.

అన్యాయం బన్యాయం
బన్యాయం బరయవే! మహాత్మా! త్రిజగ
ద్ధన్యుఁడవు సకలసురమూ
ర్ధన్యుండవు నన్నుఁ గావు తండ్రీ! కరుణన్.

197


వ.

అను నాచతుర్వేదిని విడిపించి సమవర్తి యె ట్లన్యాయం బయ్యెనని
యడిగిన నతండు ప్రాంజలియై యిట్లనియె.

198


సీ.

ఆమ్నాయములు నాల్గు నర్థయుక్తములుగాఁ
                       జదివితి మీమాంససారమెల్లఁ
నెఱిఁగి వైదికకర్మ మిట్ల నెన్నిక గాఁగ
                       నాచరించితి జగం బౌ ననంగ
ఆత్మజుల్ నాకన్న నధికులు గృహిణియు
                       నిత్యధర్మాన్విత నేఁడు నాకు
బాధ లేటికిఁ బూర్ణపరమదయానిధి
                       [1]సమవర్తి వివరింపు శాస్త్రదృష్టి

  1. వ్రాఁతప్రతిలో ఈపాదభాగము కుండలీకరింపబడియున్నది. మూలకారునివాక్యము శిథిలము కాఁగా ప్రతి వ్రాసినవారు పూర్తిచేసినట్లు తోఁచును.