పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

అధరవినిహితవంశనాళాంతరాళ
కలితవివరభ్రమత్కరాగ్రకరశాఖు
నఖిలలోకైకమోహశరాంచితాంగుఁ
బరివృతానేకబాలు గోపాలబాలు.

154


వ.

వేణునాదాకర్ణనపారవశ్యార్ధదష్టతృణధేనుపరివృతుండై యున్నం
గాంచి.

155


మ.

అనురాగంబున నాపతంగపతి దాసార్ధద్విలక్షోరుయో
జనదఘ్నేశ్వరు తత్కిరీటము [1]ప్రశస్యం బంచు గోపాలబా
లుని మస్తాగ్రమునందు నిల్ప ధరణిన్ లోకుల్ నిరీక్షింపఁ గీ
ల్కొనియెన్ మౌళియుఁ దత్ప్రమాణమున నుద్యత్పింఛధామంబుతో.

156


వ.

అప్పుడు గరుత్మంతుండు విస్మయంబునం బ్రణమిల్లి క్షీరాబ్ధికి నరిగి
మునిసన్నిధానంబున నున్న భగవంతునకు విన్నవించినఁ బరమ
హర్షంబు నొందెనని నారదుండు చెప్పిన మునులు సంతసిల్లిరి. అంత.

157

నారాయణగిరికి యాదవాద్రి యనునామంబు గలుగుట

సీ.

ఒకనాఁడు బలభద్రుఁ డుల్లాసమునఁ దీర్థ
                       యాత్రావశంబున నరుగుదెంచి
యాదవాచలశిఖరాగ్రంబునందుఁ గ
                       ల్యాణతీర్థంబున నాదిమౌని
గణములతోఁ బెక్కుకాలంబు లం దుండి
                       భవరోగభేషజభవ్యచరణు
నారాయణు భజించి చేరి చక్షుర్మనో
                       వాక్పూర్తి గాఁగ భవ్యమునఁ బొగడి


తే. గీ.

ద్వారవతి కేఁగుదెంచి యాదవశిఖావ
తంసమగు కృష్ణు నీక్షించి దక్షిణాశఁ
గంటి యాదవశైలంబు కలితభోగ
భాగ్యసౌభాగ్యశీలంబు పద్మనేత్ర!

158
  1. ప్రశస్త్యం బంచు