పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైనతేయుఁడు విరోచనుని చంపి మణికిరీటముఁ దెచ్చుట

సీ.

పక్షాగ్రవిక్షేపబహుళవాతాహతిఁ
                       గులనగంబులు గలగుండు వడఁగ
ఉద్ధితవేగమహోద్దతి శాఖ జం
                       బూప్లక్షముఖ్యముల్ పొడ వడంగ
దుర్ధరస్ఫుటనటత్రోటికోటీధాటి
                       మేఘముల్ తునియలై మింట [1]నెఱయ
శఫవినిర్ఘాతసంస్ఫాలనోదగ్రతఁ
                       దపనమండలము నెంతయును [2]నఱుగఁ


తే. గీ.

గూజితంబున రాకాసిగుండె లవియ
నక్షిరోషాగ్నివిస్ఫూర్తి నభ్రనిమ్న
గోర్మిజాలంబు తెకతెక నుడికి పొంగ
విభ్రమింపంగఁ జొచ్చెఁ బూర్వాభ్రగంబు.

152


వ.

అంతఁ బాతాళాంతరకోణంబున నున్న తేజోజితవిరోచను విరోచను
గాంచి మహత్తరయుద్ధంబుఁ గావించి శంకులాకోటితీష్ణంబైన చంచూ
పుటంబున వానిశిరంబు వ్రయ్యలు చేసి కిరీటంబుఁ గొని మింటి కెగసి
వచ్చుచు ముందట శ్యామలాద్భుతంబై యా బ్రహ్మలోకంబై యున్న
యొకదివ్యతేజంబుఁ గాంచి విస్మయం బంది యంత.

153

మహామణికిరీటము బాలమూర్తియగు శ్రీకృష్ణుని శిరమున సరిగా కుదిరి నిలుచుట

సీ.

కర్ణాంతరస్ఖలత్కలితనేత్రాంచలు
                       వ్యత్యస్తవిన్యస్తవల్గుచరణు
విమలాసనాంభోజవితతపింఛావతం
                       సవిరాజమానుఁ బ్రసన్నతేజు
అనుపమగుంజోరుహారశోభితభూషు
                       గమనీయలాంగలికర్ణపూరు
గోపీవిలోచనాంకూరసుధాశీతు
                       నంచితపూర్ణకృపాభిరాము

  1. నెరయ
  2. నరుగఁ