పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కల్పాలలో అవతరించిన పురాణాలగురించి కొంతవరకైనా ఊహించడాని కవకాశం వుంటుంది. కల్పాంతప్రళయంలో సర్వస్వం నాశనమైనట్లు పురాణాలుకూడా పోయాయంటే, అనంతర ఉదయకల్పసృష్టివ్యవస్థలో తిరిగి పురాణాలు అవతరించాయని చెప్పవలసివస్తుంది. అయితే ఆయాకల్పాలలో పురాణా లవతరించాయన్నమాట. అవాస్తవికమనో, ప్రక్షిప్తమనో త్రోసిపారవేయవచ్చును కాని ఖగోళవ్యవస్థను, తచ్చైతన్యచేష్టావ్యవస్థను తత్ప్రతిబింబకమైన భూమండలసృష్టివ్యవస్థా చైతన్యచేష్టా స్వరూపస్వభావ పరిణామక్రమాలను మనం త్రోసిపుచ్చలేము. ఇక్కడున్నది వొకటే చిక్కు. 'మఖనక్షత్రం'లో సప్తఋషులు వున్నప్పుడు మహాభారతయుద్ధం జరిగిందని అనుకుందాం. సప్తఋషిమండలం ఒక నక్షత్రంనుంచి మరొక నక్షత్రంలోకి జరుగుతూనే వుంటుంది. ఇది ఒకేవొకసారి జరిగి ఆగిపోయే వ్యవస్థకాదు. పునరావృత్తిపరంగా, యెన్నిసార్లయినా నక్షత్రచలనం జరుగుతూనే వుంటుంది. ఈదృష్ట్యా యిప్పటి కెన్నిసార్లు సప్తఋషిమండలం మఖానక్షత్రంలోకి వచ్చి వెళ్లిందో యెంతటి వైజ్ఞానికులకైనా ఊహించి చెప్పడానికి వీలులేని విషయం. కాగా, ఆర్షవిజ్ఞానందృష్ట్యా పురాణాలప్రాచీనత్వంగురించి సాధికారికంగా చెప్పాలంటే ఆయాపురాణాలలో వున్న వివిధమన్వంతరఖగోళశాస్త్రాదివిషయాలలో పరిశోధన చేసి సత్యాన్వేషణ చేయవలసివున్నది.

బ్రాహ్మణ, అరణ్యకాలంలోను, ఆపస్థంభసూత్రాలలోనూ పురాణశబ్దం ప్రయోగించబడింది. పురాణాలన్నీ ఆధునికాలని అభిప్రాయపడిన విమర్శకులు పైగ్రంథాలలో వున్న పురాణశబ్దప్రయోగానికి ప్రాచీనమనే అర్థం చెప్పి తమవాదాలను సమర్థించుకున్నారు. వాస్తవానికి బ్రాహ్మణాదులలో పేర్కొనబడిన పురాణశబ్దం అష్టాదశపురాణాలలోని పురాణవాచకమేకాని తద్భిన్నంకాదు. శ్రుతిస్మృతిపురాణేతిహాసాలన్న వాక్యంప్రకారం పురాణాల తరువాతనే బ్రాహ్మణారణ్యకాదులూ, ప్రాతిశాఖ్యలూ యితర సూత్రగ్రంథాలూ, వేదాంగాలూ, ఉపనిషత్తులు అవతరించాయని చెప్పవలసివుంటుంది. అయితే పరస్పరవిరుద్ధంగా చరిత్రకు విరుద్దంగా స్వవచనవ్యాఘాతాలుగా కనిపించే విషయాలు అనేకం మనకు పురాణాలలో గోచరమౌతాయి. ఉపనిషద్వాక్యాలప్రసక్తులేకాక పాణిన్యాదిమహర్షుల నామాలూ, జైన, బౌద్ధ, ఇతర చార్వాక, పాషండాదిమతాల ఖండనంవంటి విషయాలూ వీటిల్లో మనకు గోచరమౌతాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ఆయామహర్షుల మతకర్తలకాలం తరువాతనే పురాణాలు అవతరించాయని మనం ఆమోదించవలసి వుంటుంది. పురాణాలు బ్రాహ్మాణాదులకంటే ప్రాచీనతమాలని మనం ఆమోదించినప్పుడు పరస్పరవిరుద్ధాలూ, లేదా చారిత్రకవిరుద్దాలూ, స్వవచనవ్యాఘాతాలుగా వున్న పైవిషయాల గురించి రెండువిధాలైన నిర్ణయాలలో యేదో