పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉటంకిస్తున్నాను. యివి యిటీవల బైటపడినవే. లింకన్ అనేవ్యక్తి అమెరికా ప్రసిడెంటుగా 1860లో ఎన్నికయ్యాడు. సరిగ్గా 100 సంవత్సరాలుతరువాత కెనెడీ అనేవ్యక్తి 1960లో అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. వీరిద్దరూ కూడా తమభార్యలు తమదగ్గర వుండగానే శుక్రవారంనాడే కాల్చి చంపబడ్డారు. ఇద్దరికీ కూడా గుండు తలలోనుంచే దూసుకు పోయింది.

లింకన్ సెక్రటరీపేరు కెనడి. సెక్రటరీ లింకన్ కు సినీమాకు వెళ్లవద్దని సలహా యిచ్చాడు. కెనెడి సెక్రటరీ పేరు లింకన్. ఈ సెక్రటరీ కెనడీని "డెల్లాస్"కు వెళ్లవద్దని సలహా యిచ్చాడు. లింకన్ను చంపిన బూత్ అనే వ్యక్తి సినీమాహాలులో లింకన్ను చంపి వేర్‌హౌస్‌లోకి పారిపోయాడు. కెనెడీని చంపిన ఆస్వాల్డ్ వేర్‌హౌస్‌లో కెనెడిని చంపి సినీమాహాలులోకి పారిపోయాడు. లింకన్ తరువాత ఎన్నికైన ప్రెసిడెంట్ పేరు జాన్సన్. కెనెడీ తరువాత వచ్చిన ప్రెసిడెంట్ పేరు కూడా జాన్సనే. లింకన్ తరువాత వచ్చిన ప్రెసిడెంటు అండ్రో జాన్సన్ 1808 లో జనించగా, కెనడీ తరువాత వచ్చిన ప్రెసిడెంటు లిండన్ జాన్సన్ 1909 లో జన్మించాడు. లింకన్ను చంపిన 'బూత్‌' 1813 లో జన్మించాడు. కెనెడీని చంపిన 'ఆస్వాల్డ్‌' 1913 లో జన్మించాడు. హంతకులైన బూత్, ఆస్వాల్డ్‌లు యిద్దరూకూడా వారిమీద విచారణలు పూర్తికాకుండానే చంపివేయబడ్డారు.

పేర్లు తారుమారైనా మిగిలిన వివిధసంఘటనలతో కూడిన విశిష్టచరిత్ర అంతా స్పష్టంగా కళ్లకు కట్టినట్లు అద్దంలోని ప్రతిబింబంవలె పునరావృత్తంగా మనకు కనిపిస్తున్నది. అసలు సృష్టిలోనే సహజంగా యిటువంటి పునరావృత్తులు మాత్రమే కాదు. విభిన్నాలైన సర్వవిషయాలలోనూ చైతన్యవంతమైన పునరావృత్తి జరిగి తీరుతుందని ఆర్షవిజ్ఞానం వేనోళ్ల చాటుతున్నది. ఆధునికవైజ్ఞానికులు సైతం, యీ పునరావృత్తిసిద్దాంతాన్ని నిర్ద్వంద్వంగా కాదని త్రోసిపుచ్చే పరిస్థితులలో లేరు. కాగా సృష్టి స్థితిలయాలు స్వాభావికాలైనట్లే. అవి మరెన్నోసార్లు పునరావృత్తి కావడంకూడా స్వాభావికమే. అసలు సృష్టివ్యవస్థకే పునరావృత్తి కలిగే అవకాశ మున్నప్పుడు, సృష్టిమీద ఆధారపడి రూపొందే వివిధసంఘటనలకు గాని, చారిత్రకఘట్టాలకు కాని పునరావృత్తి కలగదని చెప్పే అవకాశంలేదు. ఆర్షవిజ్ఞానందృష్ట్యా ప్రస్తుతకాలంలో ఆరు మన్వంతరాలు గడచి, ఏడవ మన్వంతరంలో మనం వున్నామని చెప్పగలం కాని, యిప్పటికి మొత్తం. అసలు కల్పా లెన్ని గడిచాయో చెప్పలేము. బ్రహ్మ, పద్మాది కల్పాలలో బ్రహ్మ, పద్మాది పురాణా లవతరించాయంటే ఆకల్పా లెప్పుడు వెళ్లిపోయాయో, ఆగ్రంథా లెప్పుడు అవతరించాయో, మనం చెప్పలేము. 73 వేల కల్పాల నామాలు క్రమబద్దంగా మనకు లభించినప్పుడు ప్రస్తుతకల్పమేదో మనం గుర్తించగలిగితే, బ్రహ్మ, పద్మాది