పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

గర్వగ్రంథులు కొంద ఱుద్ధత మహీకాంతాగ్రణుల్ సాంపరా
యోర్విన్ దద్యదుభూషణాద్భుతభుజాగ్రోద్బూతతేజోనలా
ర్చిర్వీథిన్ శలభత్వ మందిరి జయశ్రీ నాంజనేయస్పుర
ద్దోర్వీర్యాహతిఁ [1]గొంద ఱేఁగిరి సురేంద్రుం డేలు నవ్వీటికిన్.

146


వ.

అప్పుడు నాకు నేత్రోత్సవం బయ్యె, నేమి చెప్పుదు నయ్యాహవంబు!

147


క.

హరికరుణ గలుగు నెయ్యెడ
పరిభవ మయ్యెడను లేదు పరిపూర్తి హృదం
తరమున నుండిన వారికి
నరయఁగ నెచ్చోఁ బరాజయంబులు గలవే?

148

వసుదేవుఁడు శ్రీహరి అర్చామూర్తిని బూజించుట

వ.

యాదవభూషణుండు దంపతుల ముందట హరిదివ్యవిగ్రహంబుఁ
బల్లకిపై నిడుకొని నడిపించె. అందఱు మధురాకృతియైన మధురకు
నడచిరి. అట్టియెడఁ బౌరకాంతలుఁ దద్వృత్తాంతంబు విని యంత
రంగం బుప్పొంగ నెదురుకొనిరి. కంకణధ్వనిఝంకారమణిపూరశింజి
తంబుల చేతఁ దత్సంతోషసల్లాపంబులు గప్పంబడియె. కోణాభిహత
సంక్షుభితభేరీకుహరసంభ్రమఘోషంబులు వేణువీణాస్వనకర్బుర
మర్దళడిండిమధ్వానంబులును, కాహళధ్వానంబులు నన్నియెడల
విజృంభింప వైతాళికకులోద్భవు లుభయవంశప్రశంసలు గావింప
దంపతులతోఁ గూడ నాజగత్పతిని నిజపురప్రవేశంబు సేయించె. అంత
యదుశేఖరుండు కనకమాలినితోడ నర్థితాధికదాయియైన విష్ణుదేవు
నర్చించి తత్ప్రసాదంబున [2]సకలైశ్వర్యంబులుం గాంచె. ఆయదువం
శంబున నిట్లు నెలకొనిన భగవంతునియర్చామూర్తిని వసుదేవుఁ
డర్చించుచుండె. నిజోదరంబున విశ్వంబుగల యాదేవుండు దేవకిజఠ
రంబున నుండుటయు, అన్యబంధచ్ఛేదకుం డయ్యు నులూఖలబద్ధుం
డగుటయు, ఘంటాకర్ణమోక్షప్రదాయి యయ్యుఁ దాను పుత్రార్థియై
తపశ్చరణంబు గావించుటయు, ముచికుందబంధమోచకుం డయ్యుఁ
గాలయవనునివలనఁ బలాయనము గావించుటయు, బ్రహ్మచర్యా
పరిపాలకుం డయ్యు గోపీపరిష్వంగం బొనర్చుటయు, అన్యపుత్ర
రక్షణంబును స్వపుత్రపాలనంబును విశ్వరూపంబు చూపుటయుఁ

  1. గొంద ఱుండిరి సురేంద్రుం డున్న యవ్వీడునన్.
  2. సకలైశ్వర్యములు గావించె.